Ruchika Singh Apology: ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్‌పార్టీ ఉద్యమంలో మైనర్ బాలికలు మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మోదీ తల్లిని దుర్భాషలాడారు. ప్రస్తుతం ఉద్యమం చల్లారింది. అయితే ఉద్యమ సమయంలో చిన్న పిల్లలు తనపై చేసిన దూషణలు, తన తల్లిపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. ఈమేరకు ఒక వీడియోను పోస్టు చేశారు. ఇలాంటి మాటలను పట్టించుకోవడం లేదని తన క్షమాగుణాన్ని చాటారు. ఇదే సమయంలో ఇలాంటి దూషణలను నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజాంపై ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీపై పరిశీలనాత్మక, భావోద్వేవో కూడిన వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల రుచికా సింగ్ క్షమాపణ కోరింది. మోదీని దూషించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయలో మోదీ కూడా వీడియో విడుదల చేశారు. దీంతో రుచికాసింగ్ పొరపాటు అంగీకరించి క్షమాపణ కోరారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఉద్యమ సమయంలో అక్కడి ఇన్‌ఫ్లూయెన్స్ తనపై పడడంతో అలా మాట్లాడారని అంగీకరించింది.
దూషణ నేరం కాదట..
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత దూషణ నేరం కాదని కాక్రోచ్ జనతాపార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే వ్యాఖ్యనించారు. వ్యక్తిగత ధూషణలపై ప్రధాని మోదీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 30 లక్షల మంది వీక్షించారు. దీంతో దీప్కే కూడా దీనిపై స్పందించారు. మర్యాదల పరిరక్షణ పేరుతో కేసు నమోదు వ్యవహారాన్ని ఖండించాడు. బీజేపీ ఐటీసెల్ మహిళలపై సోషల్ మీడియావేదికగా టార్గెట్ చేస్తే పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేడయం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో యువత ఆగ్రహాత్మక, సంక్లిష్ట రాజకీయ వ్యక్తీకరణలను ఎలా నిర్వహించాలన్న చర్చ మొదలైంది.
మాధ్యమాల బాధ్యత
మీడియా, ప్లాట్‌ఫార్మ్‌లు వార్తను ఆవిష్కరించే ముందు సందర్భం, వయస్సు, మూలవ్యాఖ్యలను కొలవాలి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం వ్యక్తుల జీవితాన్ని ధ్వంసం చేయకుండా ప్లాట్‌ఫార్మ్ నియమాలు తగినంత అమలు కావాలి. అయితే ఇదే సమయంలో యువత వ్యక్తిగత దూషణలు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది. ఉద్యమం చేసేవారు కూడా ఉద్యమంలో ఎవరు పాల్గొంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేది గమనించాలి. మెచ్చూరిటీతో వ్యాఖ్యానించేలా చూడాలి. పబ్లిసిటీ కోసం వయసుకు మించి వ్యాఖ్యలు చేయించొద్దు. ఇదే సమయంలో మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి.