spot_img
Homeఎంటర్టైన్మెంట్Rao Bahadur Twitter Review: 'రావు బహదూర్' ట్విట్టర్ టాక్ ఇదే... అంచనాలు తలక్రిందలు అయ్యాయిగా!

Rao Bahadur Twitter Review: ‘రావు బహదూర్’ ట్విట్టర్ టాక్ ఇదే… అంచనాలు తలక్రిందలు అయ్యాయిగా!

Rao Bahadur Twitter Review: ప్రస్తుతం మన టాలీవుడ్ లో డిఫరెంట్ తరహా ప్రయోగాత్మక చిత్రాలు బాగా క్లిక్ అవుతున్నాయి. జెన్ జీ ఆడియన్స్ రొటీన్ తరహా సినిమాలను అసలు నచ్చడం లేదు. రెండున్నర గంట పాటు సాగే సినిమా డిఫరెంట్ గా , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు నదించగలిగితే సదరు సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. హీరో ఎవరు అనేది కూడా చూడడం లేదు , వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అందిస్తున్నారు. ఆ ధైర్యం తోనే డైరెక్టర్ వెంకటేష్ మహా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరూ ముట్టుకొని జానర్ తో నేడు ‘రావు బహదూర్’ తో మన ముందుకొచ్చారు. సత్య దేవ్ హీరో గా నటించిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా గురించి ట్విట్టర్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాము.

ఈ చిత్రం ఒక అద్భుతమైన బోల్డ్ అటెంప్ట్, ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యని ప్రయోగం , కానీ సినిమా స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా మన సహనాన్ని పరీక్షిస్తుంది అంటూ కొంతమంది ట్విట్టర్ ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మన సహనానికి పెద్ద పరీక్ష నే పెడుతుందట. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని డైరెక్టర్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయడం కోసం , అదే విధంగా స్టోరీ ని సెటప్ చేయడం కోసమే సమయాన్ని కేటాయించారట, అది గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్లే బోరింగ్ ఫీల్ వచ్చిందని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో మంచి డ్రామా ఉందని , క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఎంచుకున్న కథ చాలా డిఫరెంట్ గా ఉంది కానీ , డైరెక్టర్ అనేక సన్నివేశాల్లో ల్యాగ్ చేయడం వల్ల చిరాకు కలుగుతుందని అంటున్నారు.

కానీ ఈ కథ లో సామజిక అంశాలను ట్రిగ్గర్ చేయడం హైలైట్ గా మారింది. ఇక సత్య దేవ్ ఒక బ్రిలియంట్ నటుడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా నటించారట. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో హీరోలు తమ పాత్ర విషయం లో అయ్యోమయ్యం కి గురి అవుతుంటారు , ఆ కారణం చేత కావాసినంత హావభావాలు వాళ్ళ నుండి రావడం కష్టం. కానీ సత్యదేవ్ మాత్రం కథ ని బాగా అర్థం చేసుకున్నారని , ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పని చేసారని , అతని కోసం కచ్చితంగా ఈ చిత్రాన్ని ఒకసారి థియేటర్ లో చూడొచ్చని అంటున్నారు నెటిజెన్స్. వెంకటేష్ మహా చాలా విన్నూతన ఆలోచనతో మన ముందుకొచ్చారు కానీ స్క్రీన్ ప్లే విషయం లో కాస్త క్లారిటీ గా ఉండుంటే ఈ సినిమా వేరే లెవెల్ కి వీల్లేదని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Oktelugu Epaper