Homeహెల్త్‌Curries Before Eating: భోజనం చేసేటప్పుడు ముందుగా కర్రీలు ఎందుకు పెడతారు?

Curries Before Eating: భోజనం చేసేటప్పుడు ముందుగా కర్రీలు ఎందుకు పెడతారు?

Curries Before Eating: మన భారతదేశంలో ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాం. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆయా ప్రాంతాలను బట్టి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అన్నం, కూరలను కలిపి తింటూ ఉంటారు. అయితే కొందరు పూర్వీకులు తెలుపుతున్న ప్రకారం భోజనం వడ్డించేటప్పుడు విస్తరాకు లేదా పల్లెల్లో ముందుగా కర్రీ లను వడ్డించాలని అంటారు. అలా కాకుండా అన్నింటికంటే ముందుగా అన్నం వడ్డిస్తే పిండ ప్రదానంగా భావిస్తారని చెబుతారు. అయితే శాస్త్రీయంగా కాకుండా […]

Curries Before Eating: మన భారతదేశంలో ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాం. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆయా ప్రాంతాలను బట్టి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అన్నం, కూరలను కలిపి తింటూ ఉంటారు. అయితే కొందరు పూర్వీకులు తెలుపుతున్న ప్రకారం భోజనం వడ్డించేటప్పుడు విస్తరాకు లేదా పల్లెల్లో ముందుగా కర్రీ లను వడ్డించాలని అంటారు. అలా కాకుండా అన్నింటికంటే ముందుగా అన్నం వడ్డిస్తే పిండ ప్రదానంగా భావిస్తారని చెబుతారు. అయితే శాస్త్రీయంగా కాకుండా భోజనం చేసేటప్పుడు ముందుగా అన్నం వడ్డిస్తే కూడా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం..

భారతదేశంలో కొన్ని ఆచారాలు కేవలం శాస్త్రీయంగానే కాకుండా ఆరోగ్య రక్షణ కోసం కూడా రూపొందించబడ్డాయి. వీటిలో అన్నం వడ్డించేటప్పుడు ముందుగా కూరలను వేస్తూ ఉంటారు. అలా కాకుండా ముందుగా అన్నం వడ్డిస్తే దానిని పిండ ప్రధానంగా భావిస్తారు. విస్తరాకులో ముందుగా అన్నం వేస్తే అది ప్రేతాత్మలకు ఇచ్చినట్లు అవుతుందని చెబుతూ ఉంటారు. ఎందుకంటే పిండ ప్రదానంలో ఇస్తారాకులో ముందుగా అన్నం ముద్దని ఎక్కువగా వేస్తూ ఉండడాన్ని చూస్తూ ఉంటాం.

అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ దీనిని సైన్స్ పరంగా కూడా చూడచ్చని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. భోజనం చేసే సమయంలో విస్తారాకు లేదా పళ్లెంలో ముందుగా అన్నం వేయడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే అన్నం ప్రధానంగా కార్బోహైడ్రేట్. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఆరోగ్యానికి ఇస్తున్నప్పటికీ కార్బోహైడ్రేట్ మోతారు పెరుగుతుంది. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. అయితే అన్నంతో పాటు కూరలను కలుపుకోవడం వల్ల అన్నంలో ఉండే షుగర్ కంటెంట్స్ దెబ్బతిని శరీరానికి తక్కువ మోతాదులో అందిస్తాయి. ఫలితంగా ఎలాంటి నష్టం ఉండదు.

అయితే ఇలా చేయడం వల్ల కొంత వరకు మాత్రమే సేఫ్గా ఉండగలుగుతాం. కానీ వడ్డించేటప్పుడు భోజనానికి ముందుగా అన్నం కాకుండా కూరలను వడ్డించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే కర్రీలు, పప్పులు, చారులో విభిన్న రుచులు ఉంటాయి. వీటిలో ఉప్పు, కారం, పులుపు వంటి పదార్థాలు ఉంటాయి. వీటిని ముందుగా వడ్డించి.. ఆ తర్వాత చివరకు అన్నం వడ్డించడం వల్ల అన్నంలో ఉండే షుగర్ కంటెంట్ తొందరగా కరిగిపోతాయి. ఫలితంగా శరీరానికి తక్కువ మోతాదులో షుగర్ అందుతుంది. అయితే ముందుగా కూరలు వడ్డించి ఆ తర్వాత అన్నం ను కలుపుకోవడం వల్ల కూరల్లో ఉంటే ప్రోటీన్లు అన్నంలో కలిసిపోతాయి. ఫలితంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు శరీరానికి వెళ్తాయి.

ఈ విధంగా శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడానికే భోజనం చేసేటప్పుడు ప్లేట్లో ముందుగా కర్రీ లను పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ముందుగా ప్లేట్లో అన్నం వేస్తే కొందరు కూర లేకుండా అన్నం ను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల చాలా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper