Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 2.1.2026 : ఈ రాశి వారు కొత్త వస్తువులు కొంటున్నారా?

Today horoscope in telugu 2.1.2026 : ఈ రాశి వారు కొత్త వస్తువులు కొంటున్నారా?

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. మరికొందరికి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే? మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడానికి ఆటంకాలు ఎదుర్కోవాల్సి […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. మరికొందరికి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడానికి ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఉద్యోగులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు చేసిన కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలో రాణించాలంటే తల్లిదండ్రుల మద్దతు ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మహాశివుడి ఆశీస్సులతో ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటికి చుట్టాలు రావడంతో సందడిగా మారుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడాల్సి వస్తుంది. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామికి వస్తువులు కొనుగోలు చేస్తారు. అదరపు ఖర్చులు ఉంటాయి. తగినంత ఆదాయం వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన పనులు ఇప్పుడు పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని నిరాశగా వార్తలు వినాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాలు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఎవరికి డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేయవద్దు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. లక్ష్యాలను సాధించేందుకు ఇతరుల సహాయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొంత ఆందోళన చెంది అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గుర్తింపును పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ఎటువంటి ఆటంకం ఉండదు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper