Homeహెల్త్‌Health Tips: ఈ 5 పదార్థాలను రెండోసారి వేడి చేస్తే అంతే సంగతులు..!

Health Tips: ఈ 5 పదార్థాలను రెండోసారి వేడి చేస్తే అంతే సంగతులు..!

Health Tips: ఆహారాన్ని వృథా చేయవద్దు అనే ఆలోచనతో కొంతమంది మిగిలిపోయిన దానిని రి హీట్ చేస్తుంటారు. వేడి చేసి తినడం వల్ల రిఫ్రెష్ అవుతుందని భావిస్తారు. కానీ కొన్ని పదార్థాలను రెండోసారి వేడి చేయడం వల్ల వాటిలో అనేక రసాయనాలు ఏర్పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని పదార్థాలు రీ హీట్ చేయడం వల్ల పాయిజన్ గా మారే అవకాశం ఉంది. వాటిలో ఈ ఐదింటిని అస్సలు చేయకూడదు అని […]

Health Tips: ఆహారాన్ని వృథా చేయవద్దు అనే ఆలోచనతో కొంతమంది మిగిలిపోయిన దానిని రి హీట్ చేస్తుంటారు. వేడి చేసి తినడం వల్ల రిఫ్రెష్ అవుతుందని భావిస్తారు. కానీ కొన్ని పదార్థాలను రెండోసారి వేడి చేయడం వల్ల వాటిలో అనేక రసాయనాలు ఏర్పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని పదార్థాలు రీ హీట్ చేయడం వల్ల పాయిజన్ గా మారే అవకాశం ఉంది. వాటిలో ఈ ఐదింటిని అస్సలు చేయకూడదు అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ వాటిని వేడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

టీ:
ఉదయం లేవగానే టీ తాగనిదే ఎవరికి మనసు ఒప్పదు. మానసిక ఉల్లాసానికి టీలో ఉండే పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఒక్కసారి వేడి చేసిన తర్వాతనే టీ ని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉపయోగించే షుగర్, టీ పౌడర్ మిశ్రమాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల వీటిలో కొన్ని రసాయన పదార్థాలు తయారవుతాయి. వాటిలో టానిన్స్ పెరుగుతాయి. ఆక్సిడేషన్ కాంపౌండ్స్ ఎక్కువ అవుతాయి. వీటివల్ల కడుపు మంట, గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. శరీరానికి కావాల్సిన ఐరన్ అందకుండా ఉంటుంది. తలనొప్పి, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి.

కుకింగ్ ఆయిల్:
ప్రస్తుత కాలంలో చాలామంది తినే ఫాస్ట్ ఫుడ్ లేదా ప్రాసెస్ ఫుడ్ కుకింగ్ ఆయిల్ రీ హీట్ చేసినదే అని అందరికీ తెలుసు. అయినా కూడా కొన్ని పరిస్థితుల్లో వీటిని తినక తప్పడం లేదు. అయితే కుకింగ్ ఆయిల్ ను రిపీట్ చేయడం వల్ల వీటిలో ట్రాన్స్ ప్యాట్స్, అక్రోలిన్, ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. వీటివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగిపోతుంది. కాలేయం దెబ్బతింటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

పాలకూర:
శరీరానికి తగినంత ఐరన్ తో పాటు అత్యధిక విటమిన్లు ఇచ్చే పదార్థం పాలకూర. అయితే ఇది వండినా కూరను రి హీట్ చేయడం వల్ల పాయిజన్ గా మారే అవకాశం ఉంది. దీనిని రెండోసారి వేడి చేసినప్పుడు నైట్రేట్స్, నైట్రోసమైన్స్ ఏర్పడతాయి. వీటివల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. పాలకూరను ఒక్కసారి వేడి చేసిన తర్వాత మిగిలితే దానిని పడేయడమే మంచిది.

మస్రూమ్స్:
ప్రోటీన్లు ఎక్కువ కలిగిన మస్రూమ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమే. కానీ దీనిని రి హీట్ చేయడం వల్ల టాక్సీ కాంపౌండ్స్, ప్రోటీన్ దినచరేషన్ ఏర్పడతాయి. దీంతో జీర్ణకోశ సమస్యలు, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.

రైస్:
రైస్ ను రెండోసారి వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో డయేరియా ఏర్పడే ప్రమాదం ఉంది. వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్య బారిన పడతారు. అందువల్ల ఏ ఆహార పదార్థాన్ని అయినా రెండోసారి వేడి చేయకుండా ఎప్పటికప్పుడు తీసుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper