Homeహెల్త్‌Healthy lifestyle tips: సగం రోగాలు వీటి వల్లే.. ఇలా చేసి చూడండి.. సంపూర్ణ ఆరోగ్యం...

Healthy lifestyle tips: సగం రోగాలు వీటి వల్లే.. ఇలా చేసి చూడండి.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం

Healthy lifestyle tips: ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు. అంటే మన శరీరారోగ్యం ఎంత బాగుంటే అంత మంచిదని. ఆరోగ్యం బాగోలేకపోతే ఎన్ని సంపదలు ఉన్నా ఉపయోగముండదని.. నేటి ఆధునిక కాలంలో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా శరీరం రోగాల కుప్పగా మారడంతో.. సంపాదించిన సంపద మొత్తం ఆసుపత్రిలో ఫీజులు, చికిత్సకు ఖర్చు చేస్తున్నారు.

రోగాలు వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లడం కంటే.. ముందుగానే శరీరాన్ని క్యూర్ చేసుకుంటే బాగుంటుంది. అందుకే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు వైద్యులు. రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. దానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చికిత్స కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

వెనుకటి రోజుల్లో మన పెద్దవాళ్లు ఉదయం 8 గంటల లోపు అల్పాహారం తినేవారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసేవారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏదో ఒక చిరుతిండి తినేవారు. సాయంత్రం ఏడు గంటలకు భోజనం పూర్తి చేసేవారు. నాటి కాలంలో శారీరక శ్రమ అధికంగా ఉండేది. పైగా తిన్న తర్వాత వెంటనే పనులు నిమగ్నం కావడం వల్ల కొవ్వు నిల్వలు అంతగా ఉండేవి కాదు. దీంతో వారి శరీరం లో జీవన క్రియలు సక్రమంగా ఉండేది. ఫలితంగా రోగాలు దరిచేరేవి కావు. మాంసం మితంగా తీసుకునేవారు. జంక్ ఫుడ్ అంతగా తినేవారు కాదు. శారీరక శ్రమ అధికంగా ఉండేది.

ఇప్పటికాలంలో తినే తిండి విషయంలో ఎవరూ సరైన సమయాలు పాటించడం లేదు. మాంసాహారం ఇష్టానుసారంగా తింటున్నారు. కొన్ని సందర్భాలలో అర్ధరాత్రి పూట కూడా ఆహారం తింటున్నారు. తిన్న తర్వాత వెంటనే విశ్రాంతి తీసుకుంటున్నారు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా జీవనక్రియలు జరిగే తీరులో పూర్తిగా మార్పు వచ్చింది. ఫలితంగా మధుమేహం.. రక్తపోటు.. ఇంకా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. అధిక బరువు సమస్యను నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి రోగాలు రాకూడదనుకుంటే తినే తిండి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎనిమిది గంటలకు అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేయాలి. భోజనంలో ఎక్కువగా కాయగూరలు ఉండే విధంగా చూసుకోవాలి. దంపుడు బియ్యం లేదా ముడి బియ్యంతో అన్నం వండుకోవాలి. కొర్రలు లేదా అరిగెలు.. సామలు తింటే ఇంకా మంచిది. ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ శాతం తక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట ఉడకబెట్టిన శనగలు లేదా గింజలు తినాలి. రాత్రి 7 గంటలకు భోజనం పూర్తి చేయాలి. తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి.

ఇలా చేస్తే తిన్న తిండి జీర్ణం అవుతుంది. ఫైబర్ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు. జంక్ ఫుడ్ తినకపోవడం వల్ల శరీరంలో జీవన క్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి. రక్తంలో కొవ్వు పేరుకుపోదు. శారీరక వ్యాయామం చేస్తే తీసుకున్న ఆహారానికి సంబంధించిన కేలరీలు కరిగిపోతాయి. అప్పుడు శరీరం లో జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. జీవన శైలి వ్యాధులు దరిచేరవు.. ఇలా చేస్తే గుండెపోటు.. రక్తపోటు.. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావు.

గమనిక
..
ఈ సమాచారం వివిధ వేదికల వద్ద సేకరించాం. ఇది వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. చికిత్స పొందడం అంతకంటే మంచిది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper