Cholesterol Lowering Foods : శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. ఇది పరిమితి కంటే ఎక్కువగా ఉండడంవల్ల రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడి గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. అందువల్ల కొవ్వు రాకుండా లేదా వచ్చిన కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాటిలో రెగ్యులర్ ఆహారంతోపాటు కొన్ని రకాల ప్రత్యేకమైన ఫ్రూట్స్ తినడం వల్ల కొవ్వు, కొవ్వొత్తిలా కరిగిపోతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ఫ్రూట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
నేటి కాలంలో చాలామంది ఇంట్లో కంటే బయట ఆహారం ఎక్కువగా తింటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకు పోతుంది. ఇది గుండెకు సంబంధించిన ధమనుల గోడలపై పేరుకుపోవడంతో రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఈ నాలుగు రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ కొవ్వు కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో..
బెర్రీ:
మార్కెట్లో ప్రస్తుతం స్ట్రాబెర్రీలు విరివిగా లభిస్తున్నాయి. వీటి ద్వారా కాస్త ఎక్కువగా ఉన్న అప్పుడప్పుడు వీటిని తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. మిగతా పండ్ల కంటే కాస్త రుచి తక్కువగా ఉన్నా కూడా.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ బెర్రీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల మార్కెట్ కు వెళ్ళినప్పుడు వీటిని అదనంగా తీసుకునే ప్రయత్నం చేయండి.
అవకాడో:
ఈ రకమైన ఫ్రూట్ కొన్ని మార్కెట్లో లభించినప్పటికీ.. వీటిని కూడా సందర్భాన్ని బట్టి తీసుకోవడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవకాడో కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎక్కువగా సహాయం చేస్తుంది. అయితే కేవలం అవకాడో తినడానికి ఇబ్బందులు ఏర్పడితే వీటిని సలాడ్లో చేర్చుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది.
కివి:
మన భారతీయ మార్కెట్లో కివి ఇప్పుడు ప్రతి మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కొలెస్ట్రాలను అధికంగా తగ్గించుకుని ప్రయత్నం చేయవచ్చు. దీనిని కూడా నేరుగా తినడానికి ఇబ్బంది పడితే సలాడ్లో చేర్చుకోవచ్చు. వీటి ధర అధికంగా ఉన్నప్పటికీ సందర్భాన్ని బట్టి తీసుకోవాలని కొందరు చెబుతున్నారు.
ఓట్స్:
కేవలం పనులు మాత్రమే కాకుండా ఓట్స్ వంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది.
ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్ తో బాధపడేవారు రోజు తినే ఆహారంతో పాటు ఇలాంటి ప్రత్యేకమైన పూర్తి తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల పండ్లు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.