Homeహెల్త్‌Heart Palpitations: గుండె దడ.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా.. భయపడకండి.. 2 నిమిషాల పాటు...

Heart Palpitations: గుండె దడ.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా.. భయపడకండి.. 2 నిమిషాల పాటు ఇలా చేయాలి..

Heart Palpitations: కొంతమందికి అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం… ఛాతీలో అసౌకర్యం.. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం.. ఏదో ప్రమాదం జరగబోతుందనే భయం కలుగుతుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు లేదా ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ‘గుండెపోటు వస్తుందేమో’, ‘ప్రాణానికి ప్రమాదమేమో’ అని మరింత ఆందోళన చెందుతారు. దీంతో గుండెదడ, భయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో 2 నిమిషాల పాటు ఇలా చేస్తే.. సాధారణ స్థితికి వస్తారు. మరి ఈ సమయంలో ఏం చేయాలి?

వైద్య నిపుణుల ప్రకారం.. ఇలాంటి లక్షణాలు కొన్నిసార్లు పానిక్ అటాక్ లేదా తీవ్రమైన ఆందోళన (Anxiety) వల్ల కూడా రావచ్చు. అయితే ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు గుండె సంబంధిత అత్యవసర సమస్యల్లో కూడా కనిపిస్తాయి. అందువల్ల లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా మొదటిసారి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

ఇలాంటి పరిస్థితిలో ముందుగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యం. భయంతో పదేపదే బీపీ లేదా పల్స్ చూసుకోవడం, ఏమవుతుందో?.. అని ఆలోచించడం ఆందోళనను మరింత పెంచుతుంది. కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, మనసును మరో విషయంపై కేంద్రీకరించడం వల్ల శరీరం క్రమంగా రిలాక్స్ అవుతుంది.

మనసును ప్రశాంతం అయిన తరువాత 2 నిమిషాల పాటు తమకు ఇష్టమైన మెలోడీ పాటను హమ్ చేయడం లేదా మెల్లగా పాడడం కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాటను హమ్ చేయడం వల్ల శ్వాస సహజంగా నెమ్మదిస్తుంది. మెలోడీ పాటల్లో ఉండే లయ, స్వరాల మార్పులు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో ఒత్తిడి తగ్గి, గుండె వేగం కూడా క్రమంగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.

పాట పాడడం వల్ల శ్వాసను నియంత్రించే ప్రక్రియ సహజంగా జరుగుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకుని, నెమ్మదిగా వదులుతూ హమ్ చేయడం వల్ల శరీరంలోని పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ చురుకుగా మారి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగానే కొంతమందికి హమ్మింగ్, మెల్లగా పాట పాడడం తర్వాత ఉపశమనం లభిస్తుంది.

అయితే.. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేస్తుందని చెప్పలేం. పాట పాడడం అనేది ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడే ఒక సాధారణ రిలాక్సేషన్ పద్ధతి మాత్రమే. ఇది గుండెపోటు లేదా ఇతర గుండె జబ్బులకు చికిత్స కాదు. కాబట్టి కేవలం పాట పాడితే అన్ని సమస్యలు పోతాయని భావించడం సరైంది కాదు.

ఛాతిలో తీవ్రమైన నొప్పి చేతి, దవడ లేదా వీపుకు వ్యాపించడం, శ్వాస తీసుకోవడం మరింత కష్టంగా మారడం, స్పృహ తప్పినట్లు అనిపించడం, చల్లని చెమటలు పట్టడం లేదా లక్షణాలు 10–15 నిమిషాలకు మించి కొనసాగితే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలి లేదా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular