Homeలైఫ్ స్టైల్men's health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men’s health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి చేసే పురుషులు కొన్ని సమస్యల గురించి ఇతరులకు చెప్పుకోలేరు. వారిలో వారే కుమిలిపోతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఈ సమస్యల్లో ప్రధానంగా ఐదింటి గురించి చెప్పుకోవచ్చు. అవేంటో చూద్దాం.. టెస్టోస్టెరాన్ హర్మోన్ల స్థాయి తగ్గడం..: దంపతుల్లో సంతాన సమస్యలు ఏర్పడితే ఎక్కువగా […]

men’s health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి చేసే పురుషులు కొన్ని సమస్యల గురించి ఇతరులకు చెప్పుకోలేరు. వారిలో వారే కుమిలిపోతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఈ సమస్యల్లో ప్రధానంగా ఐదింటి గురించి చెప్పుకోవచ్చు. అవేంటో చూద్దాం..

టెస్టోస్టెరాన్ హర్మోన్ల స్థాయి తగ్గడం..:
దంపతుల్లో సంతాన సమస్యలు ఏర్పడితే ఎక్కువగా ఆడవారిలో మాత్రమే సమస్యలు చూస్తారు. కానీ పురుషుల్లో కూడా ఉండే సమస్యలు కారణమవుతాయి. పురుషుల్లో టెస్టో స్టెరాయన్ హార్మోన్ల స్థాయి తగ్గితే లైంగికంగా ఆరోగ్యంగా లేనట్లేనని కొందరు చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్న వారిలో కండరాల నిర్మాణంతో పాటు ఎముకల ఆరోగ్యం, ఎర్రరక్తకణాల పెరుగుతలలో సమస్యలు రావొచ్చు. ఈ విషయాలను ఇతరులతో చెప్పుకునే అవకాశం ఉండదు.

బావోద్వేగాలు:
చాలా మంది మగవారు రకరకాల ఒత్తిడిని కలిగి ఉంటారు. అయితే తాను కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నానని ఇతరులతో చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటాడు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతూ బావోద్వేగానికి గురవుతాడు. ఒక సందర్భంగా తన బాధను వెళ్లగక్కడానికి ఒంటరిగానే ఉంటాడు తప్ప.. ఇతరులతో షేర్ చేసుకోలేడు. ఈ క్రమంలో వీరు నిద్ర సమస్యలు వంటివి ఎదుర్కొని ఇతర వ్యసనాలకు బానిసలుగా మారుతారిు.

గుండె సమస్యలను బయటపెట్టకపోవడం:
ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతలత కారణంగా పురుషులు తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో వారు గుండె సమస్యలు ఎదుర్కొంటారు. అయితే గుండె సమస్యలు ఏర్పడే ముందు ఛాతిలో నొప్పి రావడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, దవడ నొప్పి వంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీటి గురించి పట్టించుకోకుండా ఉండడమే కాకుండా నిర్లక్ష్యంగా ఉంటారు.

మానసిక సమస్యలపై దాచడం:
చాలా మంది మగవారు తమకు ఉండే మానసిక సమస్యల గురించి ఇతరులకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతారు. ఎవరికైనా తమ సమస్యలు చెబితే బలహీనమవుతామని భావిస్తారు. అంతేకాకుండా తమ సమస్యలు చెప్పడం ద్వారా సమాజంలో గుర్తింపును కోల్పోతామని అనుకుంటారు. దీంతో ఈ సమస్యల గురించి లోలోపలే బాధపడుతూ తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ఉంటారు.

లైంగిక ఆరోగ్య సమస్యలపై:
కొందరు పురుషుల్లో ఉండే లైంగిక ఆరోగ్య సమస్యల గురించి ఇతరులకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలో వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నా కూడా నిర్లక్ష్యంగా ఉంటారు.

అయితే ఈ పరిస్థితులు ఎదరైనప్పుడు తమకు నమ్మకమైన వ్యక్తితో సమస్యలు చెప్పుకోవడమే మంచిది. లేకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణానికే ప్రమాదంగా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే పురుషుల్లో ఈ సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తే వారి ఒత్తిని తగ్గించే ప్రయత్నం చేయాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper