Homeహెల్త్‌Heart Tests : గుండె సమస్యలా? ఈ 5 టెస్టులు చేయించుకోండి..లేకపోతే

Heart Tests : గుండె సమస్యలా? ఈ 5 టెస్టులు చేయించుకోండి..లేకపోతే

Heart Tests : ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా గుండెపోటు వస్తుంది. అయితే గుండెపోటు రావడానికి కారణాలు ఏంటి అని రకరకాల పరీక్షలు చేస్తుంటారు. సాధారణంగా అయితే గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తుంటారు. కానీ ఇది ఒక్కటే సరిపోదని దీనితోపాటు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే? ApoB: కొంతమందిలో చెడు కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఇందులో గుండెకు హాని చేసే […]

Heart Tests : ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా గుండెపోటు వస్తుంది. అయితే గుండెపోటు రావడానికి కారణాలు ఏంటి అని రకరకాల పరీక్షలు చేస్తుంటారు. సాధారణంగా అయితే గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తుంటారు. కానీ ఇది ఒక్కటే సరిపోదని దీనితోపాటు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే?

ApoB:
కొంతమందిలో చెడు కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఇందులో గుండెకు హాని చేసే లిపో ప్రోటీన్ కణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో ApoB టెస్ట్ అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా డయాబెటిస్, మెటబాలిక్ సమస్యలు ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ తో పాటు మిగిలిన వాటిని కూడా చూపిస్తుంది. అందువల్ల గుండెపోటు వచ్చిన వారికి ఈ టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Lp(a):
కొంతమందికి హాట్ స్టార్ వంశ పారంపర్యంగా ఉంటుందని చెబుతారు. అయితే వారసుల్లో లిప్రో ప్రోటీన్ టెస్ట్ ద్వారా హృదయ సంబంధిత సమస్యలను జన్యుపరంగా ఉన్నాయా? లేవా? అనేది తెలుసుకోవచ్చు. దీని ద్వారా లిపో ప్రోటీన్ స్థాయిలు తెలుసుకొని తమ జీవనశైలిని మార్చుకొని హార్ట్ స్ట్రోక్ తగ్గించే ప్రయత్నాలు చేయవచ్చు.

HbA1c:
కొంతమంది శరీరంలో రక్తంలో చక్కెర అధికంగా ఉండడం సహజమే. అయితే డయాబెటిస్ లేదా ఫ్రీ డయాబెటిస్ నియంత్రణ లేకపోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఈ పరీక్ష ద్వారా రక్తంలో చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. దీనిని తెలుసుకోవడం ద్వారా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.

CAC స్కోర్:
గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఈ పరీక్ష తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు పైబడిన వారు పురుషులు.. 45 ఏళ్ల వయసు పైబడిన మహిళలు ఈ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

బీపీ:
పై టెస్టులతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేయించుకోవడం చాలా అవసరం. వాస్తవానికి గుండె సమస్య ఉన్నవారిలో ముందుగా చేసే పరీక్ష ఇది . దీని ద్వారానే మిగతా టెస్టుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే ఈ పరీక్షలు ఏవైనా కూడా వైద్యుల సూచనలు మేరకు మాత్రమే నిర్వహించుకోవాలి. సొంతంగా చేయించుకోవడం వల్ల ఎలాంటి అంచనా వేయలేరు. అంతేకాకుండా గుండెపోటుకు సంబంధించి కొన్ని లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుపరంగా ఉండే వారిలో వైస్ తో సంబంధం లేకుండా హార్ట్ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివారు జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper