Protein : శరీరానికి ప్రొటీన్ అవసరం చాలా ఉంటుంది. ప్రొటీన్లు లోపిస్తే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. దీని లోపం వల్ల సరిగ్గా పని చేసుకోలేరు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అందుకే ప్రొటీన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. మరి ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారా? లేదా? ఇంతకీ ప్రొటీన్ లేదని ఎలా తెలుసుకోవాలి? ప్రొటీన్ బాడీలో సరిపోయేంత లేకపోతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కండరాలు చాలా బలహీనంగా మారుతాయి. మీరు బరువైన వస్తువులను ఎత్తడంలో ఇబ్బంది పడుతుంటారు. లేదా వర్కవుట్లు చేస్తున్నప్పుడు కూడా కండరాలు త్వరగా అలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ కష్టపడకున్నా, కండరాలకు ఎక్కువగా ఒత్తిడి పెట్టకున్నా సరే త్వరగా అలిసిపోతారు. ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు ప్రొటీన్ లోపం వచ్చినట్టే. జుట్టు పల్చబడటం కూడా ప్రొటీన్ లోపానికి కారణమే. మీ జుట్టు సన్నబడటం లేదా సాధారణం కంటే ఎక్కువగా రాలిపోవడం వంటివి కనిపిస్తుంటాయి. తలస్నానం చేస్తున్నప్పుడు, తలదువ్వుతున్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ కనిపిస్తుంది.
తరచుగా అంటువ్యాధుల బారిన పడుతుంటారు. మీరు తరచుగా జలుబు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడుతుంటారు. మీ శరీరం కోలుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. స్లో హీలింగ్ కు కూడా గురి అవుతారు. చిన్న కోతలు లేదా గాయాలు నయం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మీ చర్మం త్వరగా కోలుకోదు. సో కాస్త సమయం పడుతుంది కాబట్టి జాగ్రత్త. ప్రొటీన్ ఫుడ్ ను తసుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు పెట్టుకోండి.
మూడ్ స్వింగ్స్ కూడా అనిపిస్తుంది. మీరు మరింత చిరాకుగా, ఆత్రుతగా లేదా నిరుత్సాహానికి గురవుతారు. ఇది ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాల కొరత కారణంగా అసమతుల్యతను సూచిస్తుంది. వాపు కామన్ గా వస్తుంటుంది. మీ చేతులు, పాదాలు లేదా చీలమండలలో వాపును గమనించవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఈ వాపు మరింత ఎక్కువ అనిపిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకోవడం కూడా ఈ ప్రొటీన్ లోపం వల్ల సంభవిస్తుంది అంటున్నారు నిపుణులు.
పెళుసుగా ఉండే నెయిల్స్ కూడా ప్రొటీన్ లోపాన్ని చూపిస్తాయి. మీ గోర్లు బలహీనంగా మారడం, తేలికగా విరిగిపోవడం లేదా పీల్ గా అవుతుంటాయి. మీ శరీరానికి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తగినంత ప్రొటీన్ అందడం లేదని సంకేతం కావచ్చు. ఈ సంకేతాలు ఉంటే మాత్రం కచ్చితంగా ప్రొటీన్ లోపం అని తెలుసుకొని మంచి ప్రొటీన్ ఉన్న ఫుడ్ ను తీసుకోవాలి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Signs youre not getting enough protein
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com