COVID-19 : కరోనా పుట్టి ఐదేళ్లు గడిచింది. తొలి కోవిడ్ కేసు చైనాలో నమోదైంది. మొదట వైరస్ సోకిన వ్యక్తి అస్వస్థత, జ్వరంలో బాధపడ్డాడు. పరీక్షలు చేసిన వైద్యులు కోవిడ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అనేక మందిలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఇలా చైనాలో పుట్టిన కరోనా.. క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది. అనేక భయాలు, అనుమానాలు, ఒత్తిడితో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఒక మహమ్మారిలా మారి విలయం సృష్టించిన కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి. తొలినాళ్లలో లాక్‌డౌన్ ఒక్కటే వైరస్ కట్టడికి మార్గమని డబ్ల్యూహెచ్‌వోతోపాటు ప్రపంచ దేశాలు భావించాయి. దీంతో చైనా నుంచి అన్ని దేశాలు లాక్‌డౌన్ విదించాయి మూడు వేవ్‌లలో ప్రపంచాన్ని వణికించగా రెండు వేవ్‌లలో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేశాయి. ఈ కారణంగా కూడా చాలా మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది కోవిడ్‌బారిన పడి మృతిచెందారు.
ఎలాంటి భేదం లేకుండా…
సమాజంలో ధనిక పేద తేడాలు ఉన్నాయి. పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు అనే వయసే భేదాలు ఉన్నాయి. కానీ, కోవిడ్ ఇవేవీ చూడలేదు. అందరినీ అంటుకుంది. అందరికీ భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది. అందరూ మూతికి మాస్క్, చేతికి శానిటైజర్ రాసుకునేలా చేసింది. భౌతిక దూరం, నమస్కారం సంస్కృతిని ప్రపంచానికి చేర్పించింది. ఇక కోవిడ్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక వస్యవస్థలు, విద్యా వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికీ ఆర్థికక మాంద్యం చాలా దేశాలను వెంటాడుతోంది. ఆహారపు అలవాట్లను మార్చింది. హెల్తీ ఆహారం తీసుకోవాలని నేర్పించింది.
ఈ మార్పులు…
– ఇక కోవిడ్ కారణంగా చాలా మార్పులు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఇంటింటికీ మాస్కులు, శానిటైజర్లు వచ్చాయి. అందరూ మాస్కులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శానిటైజర్లు రాసుకునే పరిస్థితి తెచ్చింది. పరిశుభద్రతను నేర్పించింది.
– వర్క్‌ఫ్రం హోం… ఇక కోవిడ్‌కారణంగా ప్రపంచమంతా వర్క్‌ఫ్రం హోం సిస్టం వచ్చింది. వ్యవస్థలు ఆగిపోకూడదన్న భావనతో చాలా సంస్థలు వర్క్‌ఫ్రం హోం ప్రారంభించాయి. ఇప్పటికీ కొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నాయి.
– మూన్‌లైట్ సిస్టం.. ఇక వర్క్‌ఫ్రం హోం కారణంగా చాలా మంది ఇళ్లనుంచే పనిచేయడం మొదలు పెట్టారు. ఐటీ ఫ్రొఫెషనల్స్ తమ ఉద్యోగంతోపాటు పార్ట్ టైం జాబ్స్ చేయడం ప్రారంభించారు.
– ఇక కోవిడ్ కారణంగా ఇళ్లలలో ఆడుకునే పాతకాలం ఆటలు మళ్లీ అంతా కలిసి ఆడే అవకాశం కలిగింది. లూడో, క్యారమ్స్, అష్టాచెమ్మ, వైకుంఠపాళి, ఇలా చాలా ఆటలు ఇళ్లలో కుటుంబ సభ్యులు ఆడారు.
– ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది. కరోనా కారణంగా చాలా మంది ఇళ్లలోనే ఫోన్లలో గేమ్స్ ఆడడంతోపాటు, వీడియోలు చూడడం మొదలు పెట్టారు. దీంతో నెట్ వినియోగం పెరిగింది.
– సోషల్ మీడియా.. ఇక కరోనా కారణంగా చాలా మంది ఇళ్లలోనే ఉంటూ.. అనేక స్కిట్‌లు చేశారు. సోషల్ అవేర్‌నెస్ కల్పించారు. కరోనా సూచనలు, చికిత్స విధానాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమాచారం అందించారు.
– ఇక కరోనా కారణంగా పరీక్షలు రద్దయ్యాయి. చాలా మంది పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.
– మానవ అభివృద్ధి సూచికలు క్షీణించాయి. అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ఆయుర్ధాయం తగ్గింది.
– కోవిడ్ వ్యాక్సిన్లు.. అనేక కంపెనీలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుక వ్యాక్సిన్లు వేసుకున్నారు. మన దేశంలో కూడా వ్యాక్సిన్లు తయారయ్యాయి.
– ఆటలు ఆగిపోయాయి. సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంలు విస్తరించాయి.
ఇప్పటికీ కరోనా..
ఇక కరోనా ఇప్పటికీ పూర్తిగా పోలేదు. అయితే చికిత్స పద్ధతులు తెలియడం, అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగా ప్రభావం తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో కొత్త వేరియంట్ 84 దేశాలోల విజృంభించింది. సాధారణం కన్నా 20 శాతం కేసులు పెరిగాయి. పారా ఒలింపిక్స్‌కు వచ్చిన 40 మంది కోవిడ్‌బారిన పడ్డారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Covid which emerged five years ago has brought many changes around the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com