Protein powder : ప్రస్తుతం ప్రొటీన్ పౌడర్ల వినియోగం బాగా పెరిగింది. ఫిట్‌గా ఉండాలని ఈరోజుల్లో చాలామంది ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. జిమ్‌కి వెళ్లిన వాళ్లు లేదా సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరగడానికి, లావుగా ఉన్నవాళ్లు తగ్గడానికి వీటిని అధికంగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లను వేటితో తయారు చేస్తారో సరిగ్గా తెలియదు. వీటిలో హానికరమైన రసాయనాలు కలిపి తయారు చేస్తారు. ఇలాంటి వాటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమంది అయితే పిల్లలకు కూడా ఈ ప్రొటీన్ పౌడర్లను పెడుతున్నారు. పిల్లలు తొందరగా బరువు పెరగడం లేదని, సన్నగా ఉన్నారని ఎక్కువగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లను వాడటం కంటే వీటిని ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అదే ఇంట్లోనే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉంటారు. ప్రొటీన్ పౌడర్ తయారు చేసుకోవడానికి సోయాబీన్ గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, పావు కప్పు పొద్దుతిరుగుడు గింజలు, ఓట్స్, చనాదాల్, బాదం, జీడిపప్పుు, పిస్తా, వాల్‌నట్స్, మఖనా, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి. వీటితో పాటు మీకు ఇంకా ఏవైనా మీకు యాడ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. వీటిన్నింటిని కలిపి పాన్‌లో వేసుకుని.. స్టవ్ వెలిగించి 10 నిమిషాలు పాటు వేయించుకోవాలి. ఆ గింజల రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గింజలు చల్లారాయో లేదో చెక్ చేసుకోవాలి. గింజలు చల్లారి ఉంటే వాటిని మిక్సీలో వేసి మొత్తగా పొడి చేసుకోవాలి. మెత్తగా రాకపోతే పిండి జల్లెడతో జల్లించుకోవాలి. అంతే ఇక హోమ్‌మేడ్ ప్రొటీన్ పౌడర్ రెడీ అయినట్లే. దీనిని ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దాదాపు రెండు నెలల పాటు ఈ పౌడర్ నిల్వ ఉంటుంది. రోజూ దీనిని ఓ గ్లాసు పాలలో కలుపుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని వాడవచ్చు.
మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. జీర్ణ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయట దొరికే పౌడర్ల వల్ల అప్పటికి మీకు బానే అనిపించినా సరే.. తర్వాత అనారోగ్య సమస్యలు తప్పవు. వీటిలో స్వీట్ కోసం అధికంగ చక్కెర వాడుతారు. మీరు ప్రొటీన్ పౌడర్‌ను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే శరీరంలో పోషకాలు అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మర్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లను అస్సలు వాడవద్దు. కాస్త సమయం వెచ్చించి ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోండి. దీనివల్ల ఖర్చు తక్కువగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు.
Web Title: Make your own protein powder at home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com