Penuts : చలికాలంలో వేరుశెనగలు తినడం మంచిదా కాదా అనుకుంటున్నారా? అయితే పల్లికాయలను తింటే ఎక్కువ దగ్గు వస్తుందనుకుంటారు చాలా మంది. ఇక శీతాకాలం అంటేనే వేరుశెనగల కాలం. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. వేరుశెనగ తినడం ఆరోగ్య దృక్కోణం నుంచి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వేరుశెనగలో డైటరీ ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల కండరాలు కూడా బలపడతాయి. అయితే శరీరానికి మేలు చేసే వేరుశెనగ సరిగ్గా తినకపోతే ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని డైటీషియన్ లు అంటున్నారు. కొంతమంది వేరుశెనగ తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. అయితే దీన్ని తిన్న తర్వాత కొన్నింటికి దూరంగా ఉండాలట.
పాలు త్రాగవద్దు
పని తర్వగా అయిపోతుంది అని, సమయం లేదని చాలా మంది ఏదైనా తిన్న తర్వాత వెంటనే పాలు కూడా తాగి బయటకు వెళ్తారు. లేదంటే తిని పడుకుంటారు. కానీ ఇలా చేయవద్దు. ముఖ్యంగా పాలు, వేరుశనగ పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు వేరుశెనగ తింటే ఆ వెంటనే పాలు తాగడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల మన జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో కడుపునొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. వేరుశెనగ తిన్న గంట తర్వాత మాత్రమే పాలు తాగాలి. అప్పటి వరకు పాలు తాగకూడదు. ఎందుకంటే వేరుశెనగను పాలతో జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టమే అంటున్నారు నిపుణులు.
పుల్లటి పండ్లు తినకూడదు
వేరుశెనగ తిన్న తర్వాత పుల్లటి పండ్లను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పుల్లని పండ్లు తిన్న తర్వాత అలర్జీ సమస్య రావచ్చు. ఇది జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తికి ఇప్పటికే అలెర్జీ ఉంటే, అతను వేరుశెనగ తర్వాత పుల్లని పండ్లను తినకూడదు.
వేరుశెనగ తర్వాత నీరు
కొంతమంది వేరుశెనగ తిన్న తర్వాత తరచుగా నీళ్లు తాగుతుంటారు. అయితే మీరు ఇలా చేయడం మానుకోవాలి. వేరుశెనగ తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వేరుశెనగ తర్వాత నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, అనేక ఇతర సమస్యలు వస్తాయి. వేరుశెనగ తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగవచ్చు.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
మీకు దగ్గు వంటి అలర్జీ లేదా సమస్య ఉంటే వేరుశెనగ తినకూడదని నిపుణులు అంటున్నారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. దీనితో పాటు, ఏదైనా వైద్య పరిస్థితి విషయంలో ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి.