Homeఎంటర్టైన్మెంట్Vishwambhara release date: 'విశ్వంభర' విడుదల తేదీ ఖరారు.. కొడుకు రామ్ చరణ్ తో పోటీకి...

Vishwambhara release date: ‘విశ్వంభర’ విడుదల తేదీ ఖరారు.. కొడుకు రామ్ చరణ్ తో పోటీకి సిద్దమైన మెగాస్టార్.

Vishwambhara release date: ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మొదలు పెట్టిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించే సినిమా కావడంతో , ‘విశ్వంభర’ చిత్రం పై అప్పట్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. కానీ టీజర్ లో చూపించిన నాసిరకపు గ్రాఫిక్స్ పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్స్ పడడంతో, మరోసారి గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయడం కోసం , ఈ చిత్రం విడుదలని ఇన్ని రోజులు నిలిపేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని పూర్తి చేసి , ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేశారు కూడా. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.

ఈ సినిమా తర్వాత ‘విశ్వంభర’ చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఎప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అనేది మేకర్స్ ఖరారు చెయ్యలేదు. కారణం VFX కి సంబంధించిన కొన్ని షాట్స్ ఇంకా డెలివరీ అవ్వకపోవడం వల్లే. అయితే రీసెంట్ గానే ఆ షాట్స్ మొత్తం పూర్తి స్థాయిలో డెలివరీ అయ్యాయి అట, దీంతో మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని లాక్ చేసినట్టు తెలుస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జులై 10 న విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఒక సరికొత్త టీజర్ ద్వారా ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి, ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. ఇదంతా పక్కన ప్రేక్షకుల్లో , అభిమానుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం జూన్ 25 న విడుదల కాబోతున్నట్టు సమాచారం.

ముందుగా మార్చి 27 న విడుదల చేద్దామని అనుకున్నారు, ఆ తర్వాత ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు, ఇప్పటికీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడం తో ఏకంగా జూన్ 25 కి వాయిదా వెయ్యాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అదే కనుక నిజమైతే, తండ్రి కొడుకుల మధ్య బాక్స్ ఆఫీస్ పోరు ని చూడబోతున్నాము అనే అనుకోవచ్చు. గతం లో రామ్ చరణ్ #RRR రన్నింగ్ లో ఉన్నప్పుడే చిరంజీవి ‘ఆచార్య’ విడుదలైంది. ఈ సినిమా ఎంతటి ఘోరమైన పరాజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘విశ్వంభర’ ని కూడా అలా విడుదల చేస్తే అదే ఫలితం రిపీట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ‘విశ్వంభర’ అనే చిత్రం ఉందనే విషయం మెగా ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు. ఇలా పాడుబడిన సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఈమధ్య కాలంలోనే చాలా ఉదాహరణలు చూశాము. ‘విశ్వంభర’ పరిస్థితి కూడా అంతే అని అంటున్నారు విశ్లేషకులు.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper