Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen viral video: విశ్వక్ సేన్ చేసిన పనికి కేకలు వేస్తూ పరుగులు తీసిన...

Vishwak Sen viral video: విశ్వక్ సేన్ చేసిన పనికి కేకలు వేస్తూ పరుగులు తీసిన యంగ్ హీరోయిన్..వీడియో వైరల్!

Vishwak Sen viral video: యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ'(Funky Movie) బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగలడం హీరో విశ్వక్ సేన్ కి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో కెరీర్ ని మొదలు పెట్టిన విశ్వక్ సేన్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వరకు 9 సినిమాలు చేసాడు. వాటిల్లో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యినవి ఉన్నాయి, అదే విధంగా […]

Vishwak Sen viral video: యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ'(Funky Movie) బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగలడం హీరో విశ్వక్ సేన్ కి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో కెరీర్ ని మొదలు పెట్టిన విశ్వక్ సేన్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వరకు 9 సినిమాలు చేసాడు. వాటిల్లో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యినవి ఉన్నాయి, అదే విధంగా యావరేజ్ రేంజ్ లో ఆడినవి ఉన్నవి. ఒక్క కమర్షియల్ ఫ్లాప్ కూడా ఆ 9 సినిమాల్లో లేదు. ఆయన బ్యాడ్ టైం ‘మెకానిక్ రాకీ’ చిత్రం తో మొదలైంది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత విడుదలైన ‘లైలా’ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడమే కాకుండా, విశ్వక్ సేన్ కష్టపడి సంపాదించుకున్న పేరు, పరువు ని పోగొట్టుకోవడం వంటివి జరిగింది.

‘ఫంకీ’ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అనుకుంటే ఈ సినిమా ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు విశ్వక్ సేన్ మళ్లీ కెరీర్ ని మొదటి నుండి మొదలుపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే, సినిమా ఫ్లాప్ అయ్యింది అని తెలిసినప్పటికీ సక్సెస్ మీట్ లు పెట్టడం, క్రాకర్స్ ని కాల్చడం మన టాలీవుడ్ లో ఎప్పటి నుండో జరుగుతున్నదే. ఈ చిత్రానికి కూడా అదే చేశారు. విడుదలైన రోజే సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసిన నిర్మాత నాగవంశీ చాలా పొగరుగా కొన్ని మాటలు వదిలాడు. ఇక లేటెస్ట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ వద్ద హీరో విశ్వక్ సేన్ క్రాకర్స్ ని కాలుస్తూ కనిపించాడు. పక్కనే హీరోయిన్ కాయదు లోహర్ కూడా ఉంది. విశ్వక్ క్రాకర్స్ ని వెలిగిస్తున్న సమయం లో కేకలు పెట్టి లోపలకు పరుగులు తీసింది, ఆమె కేకలు పెట్టేలోపు విశ్వక్ సేన్ కూడా అరుస్తాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ అరుపులు చాలా క్యూట్ గా అనిపించాయి. కాయదు లోహర్ గతం లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించిన ‘డ్రాగన్’ చిత్రం లో హీరోయిన్ గా నటించి, భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కాయదు లోహర్, తెలుగు లో ‘ఫంకీ’ చిత్రం తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమాలో ఏదైనా పెద్ద ప్లస్ పాయింట్ ఉందంటే, అది కాయదు లోహర్ మాత్రమే అని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అందం తో పాటు నటన కూడా ఆమెది ఈ చిత్రంలో క్యూట్ గా ఉందట. ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వస్తాయి. రాబోయే రోజుల్లో ఈమె పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper