Homeఎంటర్టైన్మెంట్Actor Naresh business: అలాంటి వ్యాపారం మొదలెట్టిన సీనియర్ హీరో నరేష్..పరువు మొత్తం పోయిందిగా!

Actor Naresh business: అలాంటి వ్యాపారం మొదలెట్టిన సీనియర్ హీరో నరేష్..పరువు మొత్తం పోయిందిగా!

Actor Naresh business: సుహాస్(Actor Suhas) హీరో గా రీసెంట్ గా విడుదలైన ‘హే భగవాన్'(Hey Bhagwan) మూవీ ట్రైలర్ ని మీరంతా చూసే ఉంటారు. అయితే సెన్సార్ పూర్తి అయ్యాక, ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ ‘హే బలవంత్’ గా మార్చారు. కారణం సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడం వల్లే. అయితే ఈ సినిమా ట్రైలర్ లో సీనియర్ హీరో నరేష్ తాను చేసే వ్యాపారం గురించి బయటపెట్టడు, చాలా సీక్రెట్ గా మైంటైన్ […]

Actor Naresh business: సుహాస్(Actor Suhas) హీరో గా రీసెంట్ గా విడుదలైన ‘హే భగవాన్'(Hey Bhagwan) మూవీ ట్రైలర్ ని మీరంతా చూసే ఉంటారు. అయితే సెన్సార్ పూర్తి అయ్యాక, ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ ‘హే బలవంత్’ గా మార్చారు. కారణం సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడం వల్లే. అయితే ఈ సినిమా ట్రైలర్ లో సీనియర్ హీరో నరేష్ తాను చేసే వ్యాపారం గురించి బయటపెట్టడు, చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు. కుటుంబం మొత్తం ఆ వ్యాపారమే చేస్తుంటారు, కానీ ట్రైలర్ లో ఇంతకీ ఏంటి ఆ వ్యాపారం అనేది మాత్రం బయటపెట్టరు. సినిమా లో కూడా అలా ఆరంభం నుండి ఎండింగ్ వరకు సీక్రెట్ లో ఉంచడం లాంటివి ఏమి ఉండవు, ఆరంభం లోనే తెలిసిపోతుంది, కానీ కేవలం ఆడియన్స్ లో ఆసక్తి కలిగించడం కోసమే అలా సస్పెన్స్ లో పెట్టారు.

ఇంతకీ నరేష్ ఈ చిత్రం లో చేసే వ్యాపారం మరేదో కాదు, వ్య****రం. ఏంటో మీకు ఈపాటికే అర్థం అయ్యింది అనుకుంట. కొన్ని పరిస్థితుల కారణంగా ఈ వ్యాపారం చెయ్యాల్సి వస్తుంది నరేష్. ఇంతకీ ఏంటి ఆ పరిస్థితులు అనేది మాత్రం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో హీరోయిన్ శివాని నాగారం ని కూడా ఈ వ్యాపారం లోకి లాగాల్సి ఉంటుంది. అలా ఎందుకు జరిగింది అనేది కూడా సినిమాలో చూసి తెలుసుకోవాలి. చాలా బోల్డ్ మరియు డార్క్ కామెడీ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి సినిమాకు ‘భగవాన్’ అనే టైటిల్ ని ఉపయోగించడం పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే, మేకర్స్ మార్చాల్సి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదు.

ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ చిత్రానికి ఎక్కడం కష్టమే, కేవలం యూత్ ఆడియన్స్, జెన్ Z ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి వాళ్ళు ఈ చిత్రాన్ని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. కమెడియన్ నుండి హీరో గా మారిన సుహాస్, తన ప్రతీ సినిమాలో వైవిధ్యాన్ని వెట్టుకుంటూ, ఎవ్వరూ ముట్టుకోనటువంటి కాన్సెప్ట్స్ ని ముట్టుకొని, ఇలాంటి సినిమాలు తీస్తూ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు పోతున్నాడు. మరి ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుంది అనేది చూడాలి. ఫిబ్రవరి 20 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపి అచ్చా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper