Homeఎంటర్టైన్మెంట్Funky OTT Release Details: విడుదలైన 3 రోజులకే ఓటీటీ లోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..ఎందులో...

Funky OTT Release Details: విడుదలైన 3 రోజులకే ఓటీటీ లోకి విశ్వక్ సేన్ ‘ఫంకీ’..ఎందులో చూడాలంటే!

Funky OTT Release Details: ఈమధ్య కాలంలో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా సరే, విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్ సినిమాలు అయితే మూడు వారాలు పూర్తి అవ్వగానే ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇది సినీ పరిశ్రమకి మంచిది కాదు అని విశ్లేషకులు అంటుంటారు. కానీ నిర్మాతలు తాము పెట్టిన బడ్జెట్ ని రీకవరీ చేసుకోవాలంటే తక్కువ రోజులకే ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చని ఓటీటీ […]

Funky OTT Release Details: ఈమధ్య కాలంలో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా సరే, విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్ సినిమాలు అయితే మూడు వారాలు పూర్తి అవ్వగానే ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇది సినీ పరిశ్రమకి మంచిది కాదు అని విశ్లేషకులు అంటుంటారు. కానీ నిర్మాతలు తాము పెట్టిన బడ్జెట్ ని రీకవరీ చేసుకోవాలంటే తక్కువ రోజులకే ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చని ఓటీటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో నాలుగు వారాలకే ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాని అయినా ఓటీటీ లో చూడాల్సి వస్తోంది. అయితే సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు ఎలాంటి సమస్య లేదు. ఓటీటీ లోకి వచ్చేసిన తర్వాత కూడా థియేటర్స్ లో చూస్తుంటారు. అందుకు రీసెంట్ ఉదాహరణలు ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘ధురంధర్’ చిత్రాలు.

కానీ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం ఓటీటీ కారణం గా చావు దెబ్బలే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చిన్న హీరోల సినిమాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఇదంతా పక్కన పెడితే, రీసెంట్ గా విడుదలైన ‘ఫంకీ’ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ చిత్ర నిర్మాత నాగవంశీ తన ప్రతీ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ కి అమ్ముతూ ఉంటాడు. అలా ఈ చిత్రాన్ని కూడా మంచి ఫ్యాన్సీ రేట్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ కు అమ్మినట్టు తెలుస్తోంది. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చు అనే ఒప్పందం కుదురించుకోవడం తో, ఈ సినిమాని వచ్చే నెల 10 వ తేదీ లోపు ఓటీటీ లో విడుదల చేస్తారని అంటున్నారు విశ్లేషకులు.

సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది కాబట్టి, నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతతో ఒప్పందాన్ని సడలించుకొని, మార్చి 1న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్ సేన్, ఈ చిత్రం తో మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ, కచ్చితంగా ఈ చిత్రానికి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV దర్శకత్వం లో వచ్చిన గత చిత్ర ‘ప్రిన్స్’ కి కూడా థియేటర్స్ లో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కూడా అదే రిపీట్ అవుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper