Funky Movie: కొన్ని సినిమాలు కేవలం కొందరికి మాత్రమే సూట్ అవుతాయి, అలా ఒక హీరో చెయ్యాల్సిన సినిమాని మరొక హీరో చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. రీసెంట్ గా విశ్వక్ సేన్(Vishwak Sen) ‘ఫంకీ'(Funky Movie) చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ KV కామెడీ ని హ్యాండిల్ చేసే హీరో దొరకడం చాలా కష్టం. ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉంటేనే ఆయన సినిమాలు నచ్చుతాయి. లేదంటే ఇలాగే మిస్ ఫైర్ అవుతాయి. ‘ఫంకీ’ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరి నుండి కామన్ గా వచ్చిన మాట, ఎందుకో ఈ సినిమా విశ్వక్ సేన్ కి అంతగా సూట్ అవ్వలేదు. అనుదీప్ కామెడీ పంచులు మనోడికి వర్కౌట్ అవ్వలేదు. జాతి రత్నాలు, ప్రిన్స్ సినిమాలను నచ్చిన వాళ్లకు కచ్చితంగా ఈ ‘ఫంకీ’ సినిమా నచ్చుతుంది. కానీ హీరో మాత్రం ఎందుకో సూట్ అవ్వలేదంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
అయితే నిజానికి ఈ కథ ని అనుదీప్ విశ్వక్ సేన్ కోసం రాసుకోలేదట, ‘జాతి రత్నాలు’ సమయం లోనే నవీన్ పోలిశెట్టి కోసం రాసుకున్నాడట. అయితే రీసెంట్ గానే ఇదే తరహా సినిమా తీసాము కదా, ఆడియన్స్ రొటీన్ ఫీల్ అవుతారేమో, కొంత గ్యాప్ ఇచ్చి ఈ సినిమా చేద్దామని అన్నాడట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ చిత్రం విశ్వక్ సేన్ చేతుల్లోకి వెళ్ళింది. ఒకవేళ నవీన్ పోలిశెట్టి ఈ చిత్రాన్ని చేసుంటే మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యేదని అంటున్నారు. అనుదీప్ పైత్యాన్ని కేవలం నవీన్ మాత్రమే బ్యాలన్స్ చేయగలడని, ఆయన తప్ప ఈ చిత్రం ఎవరు చేసిన ఇదే ఫలితం రిపీట్ అవ్వుద్దని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందో లేదో చూడాలి.
అయితే అనుదీప్ భవిష్యత్తులో నవీన్ పోలిశెట్టి తో సినిమా తీసినా, ఆయన మేకింగ్ స్టైల్, రైటింగ్ స్టైల్ మార్చకపోతే మరో డిజాస్టర్ ని మూటగట్టుకోక తప్పదు. ఎందుకంటే ఆయన సిల్లీ కామెడీ ని ఆడియన్స్ నచ్చడం లేదు. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే నచ్చుతుంది. సినిమా మొత్తం మీద ఎక్కడో రెండు మూడు సన్నివేశాల్లో సిల్లీ కామెడీ ఉంటే పర్వాలేదు కానీ, సినిమా మొత్తం సిల్లీ కామెడీ ఉంటే ఎవరు చూస్తారు చెప్పండి. అనుదీప్ లో మంచి టాలెంట్ ఉంది, కాస్త ఆయన రైటింగ్ స్టైల్ ని మార్చుకుంటే సౌత్ లోనే క్రేజీ డైరెక్టర్ గా మారిపోతాడు. చూడాలి మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.