Homeఎంటర్టైన్మెంట్Anudeep Sensational Comments: 'ఫంకీ' మూవీ రిజల్ట్ తేడ కొట్టడానికి విశ్వక్ సేన్ కారణమా..? సంచలన...

Anudeep Sensational Comments: ‘ఫంకీ’ మూవీ రిజల్ట్ తేడ కొట్టడానికి విశ్వక్ సేన్ కారణమా..? సంచలన విషయాన్ని బయట పెట్టిన దర్శకుడు…

Anudeep Sensational Comments: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడం అనేది ఎంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఆ సినిమాకి సంబంధించిన కథను పర్ఫెక్ట్ గా రాసుకోవాలి. దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసుకోవాలి. అందులో నటీనటుల ఎంపిక కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇక ప్రేక్షకుడు ఇంతవరకు చూడని ఒక కొత్త ప్రపంచంలోకి అతన్ని తీసుకెళ్లగలిగేలా స్క్రీన్ మీద విజువల్స్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఒక సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. […]

Anudeep Sensational Comments: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడం అనేది ఎంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఆ సినిమాకి సంబంధించిన కథను పర్ఫెక్ట్ గా రాసుకోవాలి. దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లే ను డిజైన్ చేసుకోవాలి. అందులో నటీనటుల ఎంపిక కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇక ప్రేక్షకుడు ఇంతవరకు చూడని ఒక కొత్త ప్రపంచంలోకి అతన్ని తీసుకెళ్లగలిగేలా స్క్రీన్ మీద విజువల్స్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఒక సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. అలా కాకుండా ఏదో ఒక నాసిరకపు కథతో సినిమాను చేసేసి చుట్టేద్దాం అనుకుంటే ప్రేక్షకులు అంత అమాయకంగా లేరు. వచ్చిన సినిమాను వచ్చినట్టుగా రిజెక్ట్ చేస్తుంటారు. వాళ్లకి నచ్చాలి అంటే చాలా కసరత్తులను చేయాల్సిన అవసమైతే ఉంది…

ఇక ఈ క్రమంలోనే జాతి రత్నాలు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన డైరెక్టర్ అనుదీప్ కెవి ఆ తర్వాత చేసిన ప్రిన్స్ సినిమాతో కొంతవరకు డీలాపడ్డాడు. ఇక కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి విశ్వక్ సేన్ తో ‘ఫంకీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అనుదీప్ అనుకున్న విజయాన్ని సాధించలేదనేది వాస్తవం…

అనుదీప్ రాసిన కొన్ని పంచులు సినిమాకి హైలైట్ గా నిలిచినప్పకి మొత్తం కామెడీ పంచ్ ల మీదనే సినిమాను నడిపించడం అనేది సరైనది కాదు. మొదట సినిమాలో కథ కూడా ఉండాలి, కథ తో పాటు కామెడీ వస్తే బాగుంటుంది. ఓన్లీ కామెడీ మీదనే ఫోకస్ చేసి సినిమా చేస్తే అది ప్రేక్షకుల మెప్పు పొందదని చెప్పడానికి ఫంకీ సినిమాను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఫంకీ సినిమాలో మొదట అనుదీప్ ఒక కథని అనుకున్నప్పటికి విశ్వక్ సేన్ ఆ కథ తనకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదనే అభిప్రాయాన్ని తెలియజేశారట. దాంతో అనుదీప్ మొత్తం కామెడీ మీదనే ఫోకస్ చేశాడు. ఇక దాంతో ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ సినిమా చేయడం వల్ల ఈ సినిమాలో కథ లేకుండా పోయింది. దానివల్ల ఈ సినిమా ప్రేక్షకుడి మెప్పు పొందడం లేదు. ఫైనల్ గా ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి…కానీ ఇలాంటిదేమీ లేదని అసలు అనుదీప్ చెప్పిన కథకి విశ్వక్ సేన్ ఎలాంటి మార్పు చేయలేదట… కావాలనే కొంత మంది విశ్వక్ సేన్ ను బ్యాడ్ చేయడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారు అంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper