Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు వాళ్లకున్న టాలెంట్ తో గొప్ప సినిమాలు చేసి సూపర్ సక్సెస్ గా నిలిపారు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కారణం ఏదైనా కూడా వాళ్లు మరోసారి తమ సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్లుగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాథ్, వివి వినాయక్, శ్రీను వైట్ల లాంటి దర్శకులు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నారు. కారణమేదైనా కూడా వారి నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి అటెన్షన్ ను క్రియేట్ చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలన్నీ ఒకే జానరులో ఉండడం ప్రేక్షకులకు బోర్ కొట్టించడంతో అతని సినిమాలు వచ్చినవి వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి.
ఇక ఇప్పటికైనా తను తీరు మార్చుకొని జనాలు మెచ్చే సినిమాలు చేయగలిగితే మంచిది… వివి వినాయక్ మాత్రం కంప్లీట్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయినట్టే… ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలైతే చేయడం లేదు. గతంలో ఆయన హెల్త్ పాడైపోయింది. అయినప్పటికి తను ఇప్పుడు రికవరీ అయ్యాడు.
మరి ఇప్పుడాయన సినిమాలు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక శ్రీను వైట్ల లాంటి దర్శకుడు కామెడీకి పెద్ద పీట వేస్తూ చాలా కమర్షియల్ సక్సెస్ లను సాధించాడు. ఇక అలాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తను ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ దశకులందరు మంచి సినిమాలను చేసి గొప్ప విజయాలను సాధిస్తే చూడాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వాళ్ళు అనుకున్న సక్సెసులు వస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… వీళ్ళ అభిమానులు మాత్రం వీళ్ళకొక బ్రేక్ త్రూ దొరికితే బాగుంటుంది అని వేయి కన్నులతో వేచి చూస్తున్నారు…