Homeఎంటర్టైన్మెంట్Tollywood Directors: వాళ్ల మార్క్ ను కోల్పోతున్న దర్శకులు వీళ్లే...

Tollywood Directors: వాళ్ల మార్క్ ను కోల్పోతున్న దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఒక్కో స్టార్ డైరెక్టర్ కి ఒక్కో గుర్తింపైతే ఉంది. ఒకరు మాస్ సినిమాలను చేస్తే, మరొకరు క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంకొకరు డిఫరెంట్ జాన్స్ లో సినిమాలు చేయగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని ప్రేక్షకుడిలో క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు తమ ఐడెంటిటి ని కోల్పోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి […]

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఒక్కో స్టార్ డైరెక్టర్ కి ఒక్కో గుర్తింపైతే ఉంది. ఒకరు మాస్ సినిమాలను చేస్తే, మరొకరు క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంకొకరు డిఫరెంట్ జాన్స్ లో సినిమాలు చేయగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని ప్రేక్షకుడిలో క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు తమ ఐడెంటిటి ని కోల్పోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ కామెడీకి పెద్ద పీట వేస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలను చూస్తే అందులో పెద్దగా కామెడీ కనిపించడం లేదు. తన మార్కును పూర్తిగా పక్కన పెట్టేసి డిఫరెంట్ జానర్ లో తను ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది… కొరటాల శివ సైతం కెరియర్ స్టార్టింగ్ లో సోషల్ మెసేజ్ ని ఇస్తూ కమర్షియల్ సినిమాని చేసేవాడు.

కానీ దేవర సినిమా నుంచి ఆయన కూడా పూర్తిగా కమర్షియల్ సినిమాల బాట పట్టాడు. తన మార్కును పూర్తిగా కోల్పోయి ప్రేక్షకులు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… శేఖర్ కమ్ముల సైతం ఫీల్ గుడ్ సినిమాలను చేస్తాడనే ఒక మార్క్ అయితే అతనికి ఉంది. అలాంటి శేఖర్ కమ్ముల ఇంతకుముందు ‘కుబేర’ సినిమాతో వచ్చాడు.

ఈ మూవీ కొన్ని ఏరియాల్లో బాగా ఆడినప్పటికి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అయినప్పటికి ఆయన మరోసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా దర్శకులు వాళ్ళ ఐడెంటిటిని కోల్పోతే అభిమానులు వాళ్ళ సినిమాలను ఆదరించే అవకాశాలైతే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు స్పెషల్ గా కొంతమంది అభిమానులు ఉంటారు.

కాబట్టి వీళ్ళు చేసే సినిమాలతో వాళ్ల అభిమానులు నిరాశ పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మార్క్ సెన్సిబిలిటీస్ ను సినిమాలో మిళితం చేస్తూనే ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని కొంతమంది సినిమా విమర్శకులు వీళ్లకు సలహాలను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper