Homeఎంటర్టైన్మెంట్Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్ హీరోల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు… మన తెలుగు హీరోలతో సినిమాలు చేసి వాళ్లకు సక్సెస్ ను సాధించి పెడితే మన ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాకాకుండా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటూ […]

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్ హీరోల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు… మన తెలుగు హీరోలతో సినిమాలు చేసి వాళ్లకు సక్సెస్ ను సాధించి పెడితే మన ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాకాకుండా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటూ కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేని దర్శకులలో రాజమౌళి,సుకుమార్ లాంటి దర్శకులు ఉన్నారు. వీళ్ళు ఒకప్పుడు ఎదుర్కొన్న వివక్ష కారణంగా మన తెలుగు హీరోలతో తప్ప ఇతర హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేదంటూ పలు సందర్భాల్లో చెప్పారు.

అందువల్లే బాలీవుడ్ హీరో లు ఈ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. మొత్తానికైతే మన తెలుగు హీరోల వైపే మన దర్శకులు ఎక్కువగా మొగ్గు చూపిస్తుండటం విశేషం…రాబోయే రోజుల్లో బాలీవుడ్ హీరోలతో చేయాల్సిన సబ్జెక్ట్ ఏదైనా దొరికితే వాళ్లతో చేస్తారేమోగాని అప్పటివరకైతే వాళ్లకోసం సపరేట్ గా సబ్జెక్టులను రాసుకొని వాళ్లను డైరెక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ రాజమౌళి, సుకుమార్ లకు లేదు…

ఇక వీళ్లిద్దరూ ఇప్పుడు రాబోయే సినిమాలతో పెను సంచలనాన్నీ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సుకుమార్ పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాడు. రాజమౌళి చేసే ప్రతి సినిమా కూడా పెను సంచలనంగా నిలుస్తుంది. కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సుకుమార్ ఇప్పుడు చేసే సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడతాననే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. రాజమౌళి సైతం వారణాసి సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper