Telugu Directors : ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకొని, తెలుగులో టాప్ 5 దర్శకులలో ఒకరిగా నిలిచిన ఒక ఇద్దరు డైరెక్టర్స్ ప్రస్తుతం భారీ కంబ్యాక్ ని ఇవ్వడానికి చాలావరకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇందులో మొదటి స్థానంలో ఉన్నాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. కానీ ఆయన నుంచి ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోతున్నాయి. కారణమేదైనా కూడా తన నుంచి డిఫరెంట్ సినిమాలను కోరుకుంటున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు అతని సినిమాలను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అలాంటి రోటీన్ రొట్టా ఫార్ములా సినిమాలతోనే అతను సినిమా ఇండస్ట్రీలో తన మనుగడను ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికైనా ఆయనకు ఒక భారీ సక్సెస్ పడితేనే తప్ప లేకపోతే ఆయన కోలుకునే అవకాశం లేదు…
ఇక కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన శ్రీను వైట్ల సైతం గతంలో భారీ విజయాలను దక్కించుకున్నాడు. స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన ఆయన ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎలాగైనా సరే ఒక్క సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో గోపీచంద్ ను హీరోగా పెట్టి చేసిన ‘విశ్వం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
దాంతో ఎలాగైనా సరే ఇప్పుడు భారీ విజయాన్ని అందుకొని తనకంటూ భారీ కంబ్యాక్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఆయన శర్వానంద్ ను హీరోగా ఎంచుకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ముహూర్తం జరుపుకుంది. తొందర్లోనే షూటింగ్ ను కూడా జరుపుకోవడానికి సిద్ధమవుతుంది.
ప్రస్తుతం శర్వానంద్ సంపత్ నంది డైరెక్షన్ లో ‘భోగి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక మంచి మాస్ కమర్షియల్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఈ ఇద్దరు దర్శకులు రాబోయే సినిమాలతో వాళ్ళు అనుకున్న విజయాన్ని సాధిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
