Vivo T5x: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Vivo కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా తీసుకొచ్చే ఈ కంపెనీ లేటేస్ట్ గా ఆకట్టుకునే ఫీచర్లతో పాటు కెమెరా పనితీరు మెరుగ్గా ఉండే డివైజ్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫోన్ ఇప్పుడు కొత్తగా ఆకర్షణీయమైన కలర్లలో రాబోతుంది. చాలా మంది ఫోన్ ఇన్నర్ ఫీచర్లతో పాటు డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఈ కొత్త ఫోన్ రంగు ఎలా ఉంటుందో చూద్దాం..
వివో కంపెనీ నుంచి భారత మార్కెట్‌లోకి వచ్చిన T5x 5G మోడల్ మార్కెట్లో ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ఇప్పుడు కొత్తగా ఫ్యూజన్ రెడ్ అనే కలర్ లో విడుదలయింది. గత మార్చి నెలలో సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ రంగుల్లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు స్టైలిష్ ఎరుపు రంగులో అందుబాటులోకి రానుంది. లుక్ పరంగా ఈ కొత్త కలర్ వేరియంట్ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ ఫోన్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ 6.76 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో ఉన్న ఈ మొబైల్ స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన మీడియా టెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్ సెట్ ను అందుబాటులో ఉంచారు. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా పనిచేస్తుంది. ఇందులో 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. దీనికి 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాప్ట్ వేర్ పై పనిచేసే ఇందులో నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఐసీ69 రేటింగ్ ను ఇచ్చారు.
ఈ కొత్త ఫ్యూజన్ రెడ్ వేరియంట్ ధరల విషయానికి వస్తే.. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ 18,999 తో విక్రయిస్తున్నారు. 8ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ రూ. 20,999 గా ఉంది. టాప్ వేరియంట్ 8ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ను రూ.22,999తో విక్రయిస్తున్నారు. కొత్త రంగులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ జులై 30న మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ తో పాటు వివో ఇండియా ఇ స్టోర్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.