Happy Birthday Google: ఎక్కడో కాల్ఫోర్నియాలోని స్టాన్ ర్డ్ లో చదువుకున్నారు లారీ పేజ్, సెర్గీ బ్రిన్. వీరిద్దరూ ఒక రీసెర్చ్ ప్రాజెక్టు చేపట్టారు. దానికి బ్యాక్ రబ్ అని పేరు పెట్టారు. అది కాస్త ప్రపంచాన్ని మార్చేసింది. ఒక మ్యాజిక్ బాక్స్ లాగా గూగుల్ ను ఏర్పాటు చేసేలా చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో గూగుల్ అనేది ఒక సంచలనం. 1998 సెప్టెంబర్ 4న గూగుల్ ప్రారంభమైనప్పటికీ.. సెప్టెంబర్ 27న ఆ సంస్థ తన వార్షికోత్సవం జరుపుకుంటున్నది. నేడు గూగుల్ వార్షికోత్సవం సందర్భంగా.. ఒకసారి ఆ సంస్థ ఘనతలను తెలుసుకుందాం…
ఆల్ఫాబెట్
గూగుల్ కు మాతృ సంస్థ ఆల్ఫాబెట్. ఇప్పటికి గూగుల్ సంస్థ మ్యాప్స్.. ట్రాన్స్లేట్.. న్యూస్.. చాట్, కాంటాక్ట్స్, యూట్యూబ్.. జిమెయిల్ వంటివి దాదాపుగా ఉచితంగానే ఈ సర్వీసులు అందుతాయి. అయితే వీటి ద్వారా ఆ సంస్థకు రాష్ట్ర ఆదాయం 35 లక్షల కోట్లకు పైగానే వస్తుంది. ఇందులో 75% కేవలం యాడ్స్ ద్వారానే వస్తుంది. మిగతాది గూగుల్ క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ ద్వారా లభిస్తుంది.
గూగుల్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూ లో ఉంది. ఈ సంస్థకు సీఈవోగా సుందర్ పిచాయ్ కొనసాగుతున్నారు. 2004లో గూగుల్ సంస్థల్లో ఒక సాధారణ ప్రోడక్ట్ మేనేజర్ గా చేరారు సుందర్. ఆ తర్వాత అనతి కాలంలోనే సీఈఓ స్థాయికి వచ్చారు. ఈ సంస్థకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సంస్థను రకరకాల కార్యకలాపాల కోసం వాడేవారు 500 కోట్లకు పైగా ఉంటారు. Google సంస్థ సెర్చ్ ఇంజన్ మొదలు పెట్టినప్పుడు తొలి రోజుల్లో కేవలం పదివేల సంఖ్యలో మాత్రమే సెర్చ్ లు జరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1400 కోట్లకు పైగా పెరిగింది. అనేక రకాల అంశాలను ప్రస్తుతం వెతుకుతున్నారు. నిమిషానికి 95 లక్షలకు పైగా సెర్చ్ లు గూగుల్ లో జరుగుతున్నాయి.. గూగుల్ అనే పదానికి ఒకప్పుడు ఎటువంటి అర్థం ఉండేది కాదు. గూగుల్ సంస్థ ఆవిర్భావం తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ పదానికి చోటు కల్పించారు.. ఇక చైనా.. ఉత్తరకొరియా.. రష్యా.. ఇరాన్.. సిరియా వంటి దేశాలలో అక్కడి సొంత సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాలలో గూగుల్ సేవలు పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధానికి గురయ్యాయి.
మేకల్ని వాడుతుంది
గూగుల్ సంస్థలో గడ్డిని కత్తిరించడానికి యంత్రాలను అస్సలు ఉపయోగించరు. శబ్దం రాకూడదు. పొగ అసలు ఏర్పడకూడదు. అందువల్లే 200 మేకలను అద్దెకి తెచ్చుకొని.. ఆ గడ్డిని మేపడానికి ఉపయోగిస్తారు.. ఇక గూగుల్ చరిత్రలో అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. Google చరిత్రలో కూడా ఎవరు అడగని సరికొత్త ప్రశ్నలు ఉంటాయి… Google వేలాది సర్వర్లను వాడుతూ ఉంటుంది. అవి పని చేస్తున్నప్పుడు విపరీతమైన వేడి వెలువడుతుంది. దానిని తగ్గించడానికి సముద్రపు నీటిని వాడుకునే ప్రత్యేకమైన ఫ్లోటింగ్ డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ పేట రైట్లు తెచ్చుకుంది. గూగుల్ సంస్థ గతంలో ఆర్కుట్.. గూగుల్ టాక్ వంటి యాప్స్.. సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ద్వారా అంతగా ఆదాయం లేకపోవడంతో మూసివేసింది. సరిగ్గా 2013లో గూగుల్ సంస్థకు సంబంధించిన సర్వీసులు ఒక ఐదు నిమిషాల పాటు ఆగిపోయాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగింది. ఆ కాస్త సమయంలోనే ఇంటర్నెట్ ట్రాఫిక్ 40% జామైంది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు విపరీతమైన గందరగోళానికి గురయ్యారు.
ఇక ప్రస్తుతం గూగుల్ నాసా కు సంబంధించిన ఒక ఎయిర్ ఫీల్డ్ ను 60 సంవత్సరాల పాటు అద్దెకి తీసుకుంది. ఇందులో ఏం చేస్తోంది అని అనుమానం అందరిలోనూ ఉంది. గూగుల్ సంస్థ అత్యంత అధునాతనంగా రూపొందిస్తున్న రోబోటిక్స్.. డ్రోన్స్.. ఇతర ఏ ఐ ప్రయోగాలను ఇందులో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం పోటీ సంస్థలకు తిరుగులేని స్థాయిలో సవాల్ విసరడానికి గూగుల్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మానవజాతి చరిత్రను సమూలంగా మార్చేసిన అనేక ఆవిష్కరణలలో గూగుల్ ఒకటి. గూగుల్ లేకుండా ఇప్పటి కాలంలో మనిషి జీవితాన్ని.. మనుగడను ఊహించడం కష్టం.