Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి ని వెంటాడుతున్న ఆ డైరెక్టర్ ఎవరు..?

Chiranjeevi: చిరంజీవి ని వెంటాడుతున్న ఆ డైరెక్టర్ ఎవరు..?

సంచలన దర్శకుడుగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ మాత్రం చిరంజీవిని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఏదో ఒక రకమైన మాటలు మాట్లాడుతునే ఉంటాడు. ఆయన తో సినిమా చేస్తానని చెప్పి మధ్యలో వదిలేసి పోయిన వర్మ ని అప్పటి నుంచి చిరంజీవి దూరం గా పెడుతూ వస్తున్నాడు.

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవ అలాంటిది. అలాగే సినిమాతో పాటు గా, కళాకారులను కూడా చాలా రకాలుగా ఆడుకున్నారు. ఇక ఇలాంటి చిరంజీవి తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ అనే హోదా ని దక్కించుకున్నాడు. అయినప్పటికీ తను ఎక్కడ కూడా ఎలాంటి గర్వం చూపించకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు తప్ప ఆయన ఎవరిని కనీసం ఒక్క మాట కూడా అనరు…

అయితే సంచలన దర్శకుడుగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ మాత్రం చిరంజీవిని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఏదో ఒక రకమైన మాటలు మాట్లాడుతునే ఉంటాడు. ఆయన తో సినిమా చేస్తానని చెప్పి మధ్యలో వదిలేసి పోయిన వర్మ ని అప్పటి నుంచి చిరంజీవి దూరం గా పెడుతూ వస్తున్నాడు. ఇక అది జీర్ణించుకోలేని వర్మ చిరంజీవి ని ఉద్దేశించి సోషల్ మీడియా లో ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న మెగా ఫ్యామిలీ అంటే ఎవరు అని బాలీవుడ్ లోకి వెళ్లి అడిగితే వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పాల్సి ఉంటుంది, అంతే తప్ప మెగా ఫ్యామిలీని అక్కడ ఎవరు గుర్తుపట్టరు అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే అటు పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని ఇద్దరిని టార్గెట్ చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిసారి వర్మ కామెంట్ చేస్తూ ఉంటాడు.

ఆయన అలా ఎందుకు కామెంట్ చేస్తున్నారు అంటే అప్పుట్లో చిరంజీవి సినిమాని మధ్యలో వదిలేసి పోయిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చాక సినిమా లేదు ఏం లేదని చిరంజీవి చెప్పి అప్పటినుంచి వర్మని పక్కన పెట్టాడు. కాబట్టి వర్మ ఆ కోపం తోనే ఎప్పుడు చిరంజీవి మీద మాటల యుద్ధం చేస్తూ ఆయన మీద కామెంట్లు చేస్తూ వస్తున్నాడు. కానీ చిరంజీవి మాత్రం వర్మ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తన సినిమాల్లో తను బిజీగా ఉంటున్నాడు.ఇక ఇప్పుడు చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అనిల్ రీసెంట్ గా బాలయ్య తో చేసిన భగవంత్ కేసరి సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. కాబట్టి చిరంజీవితో కూడా ఇప్పుడు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper