Ram Charan And Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే టార్చ్ బేరర్ గా మారాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది… ఇక దానికి తోడుగా సందీప్ వంగ కి అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
కాబట్టి తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో క్లారిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లైతే చేస్తున్నారు. ఇక స్పిరిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలైతే చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ఫుట్ బాల్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుందట.
ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాలో ఫుట్ బాల్ కి సంబంధించిన ఒక సీన్ అయితే ఉంటుంది. అందులో తన ఐడెంటిటిని చూపించిన సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో అంతకు మించిన ఒక స్పిరిట్ లెవెల్ ని చూపిస్తూ స్పోర్ట్ అంటే ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నమైతే చేస్తున్నాడట… ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేస్తే ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. రామ్ చరణ్ కి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే సినిమా అవుతుందనే ఉద్దేశ్యంతో వాళ్లు ఉన్నారు… వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అటెన్షన్ ని రామ్ చరణ్ తనవైపు తిప్పుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…