spot_img
Homeఎంటర్టైన్మెంట్Tholiprema  Re-release : రూపాయి ప్రొమోషన్స్ లేకుండా ఇవేమి అడ్వాన్స్ బుకింగ్స్ సామీ..ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తున్న...

Tholiprema  Re-release : రూపాయి ప్రొమోషన్స్ లేకుండా ఇవేమి అడ్వాన్స్ బుకింగ్స్ సామీ..ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తున్న ‘తొలిప్రేమ’

Tholiprema  Re-release : రీసెంట్ సమయం లో రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన స్టార్ హీరోల కెరీర్స్ లో కల్ట్ క్లాసిక్స్ గా నిల్చిన కొన్ని సినిమాలను 4K క్వాలిటీ కి మార్చి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.అలా రీ రిలీజ్ అయినా చిత్రాలలో ఇప్పటి వరకు అన్నీ సినిమాలకంటే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం నిల్చింది. ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.

ఈ సినిమాకి అప్పట్లో ఎలాంటి మేనియా ఉన్నింది అంటే, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల అయితే ఎలాంటి మేనియా, ఎలాంటి హంగామా ఉంటుందో, అలాంటి హుంగామ ఉన్నింది. టికెట్స్ కూడా యుద్దాలే జరిగాయి. ఆ రేంజ్ క్రేజ్ ఉంది కాబట్టే ఈ సినిమాకి మొదటి రోజు 4 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఫుల్ రన్ లో 7 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసినట్టు ట్రేడ్ పండితుల అంచనా.

ఈ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి ఇతర హీరోలు చాలా ప్రయత్నాలే చేసారు, కానీ కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇప్పుడు ఈ చిత్రం వసూళ్లను మళ్ళీ పవన్ కల్యాణే బద్దలు కొట్టబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆయనని స్టార్ హీరో గా నిలబెట్టిన ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ తొలిప్రేమ చిత్రం ఈ నెల 30 వ తారీఖుతో విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మరో రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. అయితే ఇది థర్డ్ పార్టీ కి సంబంధించిన సినిమా కావడం తో, ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు అనే ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో భారీ ఎత్తున ప్రమోట్ చేసారు.

నిన్న ఈ సినిమాకి సంబంధించి కొన్ని షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో మూడు షోస్ యాడ్ చేస్తే ఆ మూడు షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం, మరి ఈ సినిమా అనుకున్నట్టుగానే బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించి ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper