Japan Technology: ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉండడం గొప్ప విషయం. ఆ తర్వాత కలర్ టీవీలు వచ్చాయి. స్మార్ట్ టీవీలు వచ్చాయి..4k, 8k, OLED, QLED అంటూ టెలివిజన్ ప్రపంచం ఎన్నో రకాల మార్పులను చూసింది. చూస్తూనే ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మరో అడుగు ముందుకు వేస్తోంది.
ఇకపై సినిమా చూడాలంటే టీవీ ముందు కూర్చోవాల్సిన అవసరం లేకపోతే.. ఇంట్లో ప్రత్యేకమైన స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిన పనిలేకపోతే.. మన కళ్ళ ముందు గాలిలోనే 3డి చిత్రాలు కనిపిస్తే.. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నా.. జపాన్లో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు.. ప్రయోగాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే చిత్రాలు.. హోలో గ్రాఫిక్ డిస్ ప్లే లు.. లేజర్ ఆధారిత విజువల్ టెక్నాలజీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
గాలిలోనే కనిపించే టీవీ ASKA 3D టెక్నాలజీ
జపాన్ దేశానికి చెందిన అను కానెట్(Asukanet) సంస్థ అభివృద్ధి చేసిన ASKA 3D టెక్నాలజీ ఈ రంగంలో ఆసక్తికరమైన ఆవిష్కరణగా నిలుస్తోంది. సాధారణ టీవీ లేదా కంప్యూటర్లో చిత్రాలు కనిపించాలంటే ఒక స్క్రీన్ అవసరం. కానీ ఈ టెక్నాలజీలో ప్రత్యేకమైన ఆప్టికల్ ప్లేట్ ఉపయోగిస్తారు. ఇందులో వేలాది సూక్ష్మ అద్దాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఒక సాధారణ డిస్ ప్లే నుంచి వచ్చే కాంతిని ఈ ప్లేట్ ప్రత్యేకంగా మళ్లిస్తుంది. దీంతో స్క్రీన్ కు అవతలి వైపు గాలిలోనే చిత్రం కనిపించినట్టుగా ఉంటుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇన్ ఫ్రారెడ్ సెన్సార్లను జత చేస్తే ఆ గాలిలో కనిపించే చిత్రాన్ని తాకకుండానే కంట్రోల్ చేయవచ్చు. జపాన్ లోనే హీరోషిమా బ్యాంక్ ఏటీఎంలో ఇతర సాంకేతికతను ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు. కస్టమర్లు గాలిలో కనిపించే బట్టలను ఉపయోగించి లావాదేవీలు నిర్వహించగలరు. పక్కనే నిలబడిన వ్యక్తికి ఆ సమాచారం కనిపించకుండా ఉండేలా పరిమిత వీక్షణ కోనం కూడా ఉంటుంది. అంటే భవిష్యత్తులో టచ్ స్క్రీన్ల స్థానంలో టచ్ చేయాల్సిన అవసరం లేని డిస్ ప్లే లు వచ్చే అవకాశం ఉంది
రెటీనా ప్రొడక్షన్
జపాన్ దేశానికి చెందిన టిడికే సంస్థ ఎన్ టి టి సహకారంతో అభివృద్ధి చేసిన లేజర్ మాడ్యూల్ ఈ రంగంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. సాధారణంగా కళ్లద్దాలు లేదా హెడ్సెట్ తో చిన్న డిస్ప్లే ఉంటుంది. కానీ రెటీనా ప్రొజెక్షన్ విధానంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల లేజర్ కాంతిని ఉపయోగించి చిత్రాన్ని నేరుగా కంటి రెటీనా పైకి పంపిస్తారు. ఈ టెక్నాలజీలో ఉపయోగించే ప్రత్యేక మాడ్యూల్ బరువు కేవలం 0.38 గ్రాములు మాత్రమే. దాదాపు 1.62 కోట్ల రంగులను ప్రదర్శించగల సామర్థ్యం ఉందని సంబంధిత సాంకేతిక వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల బహుత్ కాలంలో చిన్న స్మార్ట్ గ్లాసెస్ ద్వారా సినిమాలో చూడటం.. సమాచారాన్ని చదవడం.. వీడియోలు వీక్షించడం సాధ్యమవుతుంది. చూపు తక్కువగా ఉన్న కొంత మందికి కూడా ఈ తరహా రెటీనా ప్రొజెక్షన్ కళ్లద్దాలు ఉపయోగపడే అవకాశం ఉంది.
జపాన్ దేశానికి చెందిన మరో దిగ్గజ సంస్థ సోని కూడా ఈ రంగంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సోనీ అభివృద్ధి చేసిన స్పాటియల్ రియాల్టీ డిస్ప్లే టెక్నాలజీలో ప్రత్యేక కెమెరా వీక్షకుడి కళ్ళస్థానాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత ప్రతి కంటికి తగిన కోణంలో వేరువేరు చిత్రాలను అందిస్తారు. దీంతో ఎలాంటి త్రీడీ కళ్లద్దాలు ధరించకుండానే వస్తువులు స్క్రీన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తాయి. దీనిని డిజైన్.. గేమింగ్.. హెల్త్ కేర్.. 3d మోడలింగ్ వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సోనీ ఎక్స్ వై ఎన్ వ్యవస్థ ద్వారా రియల్ లైఫ్ లోని వస్తువులు.. ప్రదేశాలను 3d డిజిటల్ రూపంలోకి మార్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది..
జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్హెచ్కె కూడా భవిష్యత్తు టెలివిజన్ టెక్నాలజీ మీద ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటివరకు టీవీలో మనకు కనిపించేది రెండు డైమెన్షన్ల చిత్రం. కానీ భవిష్యత్తులో వస్తువులను వివిధ కోణాల్లో చూడగలిగే 3d స్పెషల్ ఇమేజింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. ఎన్హెచ్కె పరిశోధనలో భాగంగా ఆక్టినా విజన్ అనే వ్యవస్థను ప్రదర్శించింది. ఇందులో అనేక కోణాల నుంచి చిత్రాలను తీసుకొని.. 8 కే ప్రొజెక్షన్ ద్వారా త్రీడీ లైట్ ఫీల్డ్ ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రయత్నాల నేపథ్యంలో నిజంగానే టీవీలకు కాలం చెల్లిపోతుందా.. అంటే దీనికి విశేషకులు అవును అని సమాధానం చెబుతున్నారు. కాకపోతే ఈ టీవీలకు ఖరీదు ఎక్కువ. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి కాబట్టి.. ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి టైం పట్టుద్ది. ముఖ్యంగా స్మార్ట్ గ్లాసెస్.. గాలులో కనిపించే డిస్ప్లేలు.. కళ్లద్దాలు అవసరం లేని త్రీడీ స్క్రీన్ లు కొత్త అనుభూతిని అందించడం మాత్రం గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు.