Muhammad Ali Jinnah: పంజాబ్ రెండుగా చీలిపోయింది. భారత్, పాకిస్తాన్ విభజన జరిగింది. నాడు పాకిస్తాన్ నుంచి భారత్ వైపు.. భారత్ నుంచి పాకిస్తాన్ వైపు జన ప్రవాహం సాగింది. ఒకరకంగా నాడు ఉద్విగ్న పరిస్థితి చోటు చేసుకుంది. ఇదంతా కూడా దేశ విభజన నాటి దుస్థితి.
నాడు దోపిడీలు జరిగిపోయాయి.. హత్యలు చోటుచేసుకున్నాయి.. రక్తం ప్రవాహం లాగా సాగింది. భయంకరమైన దారుణాలు జరిగాయి.. హింస అయితే తార స్థాయికి చేరింది. అశాంతి పెచ్చ రెల్లి పోయింది. ఒక దశలో ప్రజల మధ్య కట్టుబాట్లు చెరిగిపోయాయి. వారిలో తీవ్రస్థాయిలో ఆగ్రహం పెల్లు బుకింది. చివరికి ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి నాడు పరిస్థితులు దిగజారిపోయాయి. ఒక దశలో నాటి పోలీసులు చేతులెత్తేశారు. ఇతర వ్యవస్థలు కూడా తప్పుకున్నాయి. అంతటి దారుణానికి ప్రధాన కారణం దేశ విభజన..
దేశభజన కోసం నాడు మహమ్మద్ అలీ జిన్నా తీవ్రస్థాయిలో పట్టుపట్టారు. 1947లో భారత్, పాకిస్తాన్ విభజన చోటుచేసుకుంది. పాకిస్తాన్ రెండుగా చీలిపోయింది. లక్షల మంది ప్రజలు సరిహద్దులను దాటి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. నాటి రోజుల్లో దోపిడీలు జరిగిపోయాయి. హత్యలు చోటుచేసుకున్నాయి. హింస తారస్థాయికి చేరుకుంది. వాస్తవానికి ఇంత స్థాయిలో హింస చోటు చేసుకుంటుందని మహమ్మద్ అలీ జిన్నా అంచనా వేయలేదు. చివరికి ప్రత్యేక విమానంలో ఆయనకు పరిస్థితిని చూపించిన తర్వాత తల పట్టుకున్నారు. ఘోర తప్పిదం చేశానని ఏడ్చారు.
ఇదే విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ తన ఆత్మకథ బియాండ్ ద లైన్స్ లో పేర్కొన్నారు. విభజన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసను నాడు లహరులో ఉన్న జిల్లాకు పాకిస్తాన్ దేశానికి చెందిన మంత్రి ఇఫ్తికార్.. పాకిస్తాన్ టైమ్స్ ఎడిటర్ మజహర్ అలీ వివరించారు. అయితే దీనిని మహమ్మద్ జిన్నా నమ్మలేదు. ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లి చూపించిన తర్వాత తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే ఈ విషయాన్ని మజహర్ అలీ.. ఇఫ్తికార్ బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని మజహర్ తన భార్యతో చెప్పుకున్నారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత మజాహర్ భార్య తాహిర కులదీప్ కు చెప్పారు.
దేశ విభజన తర్వాత ప్రజలను అటు ఇటు మార్చడానికి కాంగ్రెస్, ముస్లిం లీగ్ తిరస్కరించాయి. ముస్లింలు, ముస్లిమేతరులు తమ గృహాలలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా హింస చెల్లదగిన నేపథ్యంలో నాడు ఏర్పడిన వాగా అటారి సరిహద్దులను దాటి వెళ్లడానికి రెండు వైపుల నుంచి ప్రజలు భారీగా పోటెత్తారు. కులదీప్ కుటుంబం పాకిస్తాన్ నుంచి భారత వైపు వచ్చింది. ఇలా వచ్చే క్రమంలో వాగ సరిహద్దు వద్దకు చేరుకుంది. నాటి దృశ్యాలను కులదీప్ తన ఆత్మ కథలో రాసుకున్నారు. రహదారి పక్కన మొత్తం శవాలు ఉన్నాయని.. వాటి పక్కన సూట్ కేసులు.. సంచులు.. పెట్టెలు ఉన్నాయని అతడు పేర్కొన్నారు. ఆగస్టు 14న పాకిస్తాన్ దేశం స్వాతంత్ర దినోత్సవం గా జరుపుకుంటుంటే.. ఆరోజున మత విద్వేషాల వల్ల చోటు చేసుకున్న హత్యలు.. దోపిడీలను స్మరించే రోజుగా భారత్ పాటిస్తోంది.