Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda: 'విజయ్ దేవరకొండ'ను భారీ బిల్డప్ తో చూపిస్తాడట !

Vijay Deverakonda: ‘విజయ్ దేవరకొండ’ను భారీ బిల్డప్ తో చూపిస్తాడట !

Vijay DeverakondaVijay Deverakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తోన్న సినిమా ‘లైగర్’. కాగా ఈ సినిమా కీలకమైన షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో పూరి ఈ సినిమాలో చూపించబోతున్నాడు.

పైగా ఈ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుంది. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైందంటూ విజయ్ దేవరకొండ లొకేషన్ లో కూర్చున్న ఫోటోని ఈ చిత్ర నిర్మాత ఛార్మి షేర్ చేసింది. విజయ్ కూర్చున్న తీరు, విజయ్ ఫిజిక్ ను చూస్తుంటే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అర్ధమవుతుంది.

వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాలని పూరి ప్లాన్ చేశాడు. నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే వచ్చింది. కానీ, ఈ సారి గ్యాప్ లేకుండా షూట్ ను ప్లాన్ చేస్తున్నాడు పూరి. ఇక ‘లైగర్’ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలనేది ప్లాన్.

కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper