Homeఎంటర్టైన్మెంట్విజయ్ దేవరకొండ నుండి ఛార్మికి ప్రత్యేక గిఫ్ట్ !

విజయ్ దేవరకొండ నుండి ఛార్మికి ప్రత్యేక గిఫ్ట్ !

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’ సినిమాకే పూర్తిగా పరిమితం అయిపోయాడు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే వచ్చింది. సరే టైం అంతా వేస్ట్ అయిపోయినా సరే ఈ లాంగ్ జర్నీ వల్ల విజయ్ దేవరకొండకి పూరి జగన్నాధ్ కి మధ్య మంచి అనుబంధం అయితే ఏర్పడింది. ఐతే, వీరిద్దరి మధ్య బంధం […]

Vijay Devarakondaసెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’ సినిమాకే పూర్తిగా పరిమితం అయిపోయాడు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే వచ్చింది. సరే టైం అంతా వేస్ట్ అయిపోయినా సరే ఈ లాంగ్ జర్నీ వల్ల విజయ్ దేవరకొండకి పూరి జగన్నాధ్ కి మధ్య మంచి అనుబంధం అయితే ఏర్పడింది.

ఐతే, వీరిద్దరి మధ్య బంధం మాదిరిగానే ఈ సినిమా కో-ప్రొడ్యూసర్ మాజీ హీరోయిన్ ఛార్మితో కూడా విజయ్ దేవరకొండకి మంచి బాండింగ్ ఏర్పడిందట. లేకపోతే ఛార్మి పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరీ ఆమెకి ఇష్టమైన కేక్ ను ఆర్డర్ చేసి ఎందుకు పంపుతాడు. పైగా విజయ్ దేవరకొండ పంపిన కేక్ ఛార్మికి బాగా ఇష్టం అట. వీరి మధ్య తరుచూ ఏదొక గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకోవడం అనేది అలవాటుగా మారిందట.

అందుకే కేక్ తో పాటు మంచి గిఫ్ట్ కూడా ఛార్మి కోసం పూరి ప్రత్యేకంగా పంపాడట. ఇక విజయ్ దేవరకొండ పండిన కేక్ ను వీడియో తీసి ఛార్మి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. విజయ్ తో తనకున్న సన్నిహిత స్నేహాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక ‘లైగర్’ సినిమాని ఈ సెప్టెంబర్ లో విడుదల చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.

ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం విజయ్ సిక్స్ ప్యాక్ చేశాడు. పైగా బాక్సర్ గా పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బాగా కష్టపడుతున్నాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper