Homeఎంటర్టైన్మెంట్Vijay Antony Daughter: విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోని సుసైడ్ లెటర్ వైరల్.. షాకింగ్...

Vijay Antony Daughter: విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోని సుసైడ్ లెటర్ వైరల్.. షాకింగ్ నిజాలు

చదువులో చురుకుదనంగా ఉండడంతో కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైందట మీరా. కానీ ఎందుకో మానసిక ఒత్తిడికి లోనవడంతో చికిత్స కూడా తీసుకుంది.

Vijay Antony Daughter: ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మరణించడంతో తమిళ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. చెన్నై అళ్వార్‌పేట‌లో గల డీడీకే రోడ్‌లో నివసిస్తోంది విజయ్ ఆంటోనీ కుటుంబం. ఆయనకు భార్య ఫాతిమా, ఇద్దరు కుమార్తెలు లారా ఆంటోని, మీరా ఆంటోనీ ఉన్నారు. 16 సంవత్సరాల మీరా చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నారు. చదువులో వెనుకపడటం ఒత్తిడిలోకి నెట్టినట్టు చెబుతున్నారు. ఈమె 2007లో జన్మించారు. డాక్టర్ అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉండేదట.

చదువులో చురుకుదనంగా ఉండడంతో కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైందట మీరా. కానీ ఎందుకో మానసిక ఒత్తిడికి లోనవడంతో చికిత్స కూడా తీసుకుంది. అయితే సడన్ గా సెప్టెంబర్ 19న మీరా గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఆందోళన చెందింది. ఇక పోస్టు మార్టం రిపోర్ట్ లో మీరాది ఆత్మహత్య అని తేలింది. ఈ సందర్బంగా ఆమె సూసైడ్ నోట్ ను కూడా గుర్తించారు పోలీసులు. అయితే లవ్ యవూ ఆల్, మిస్ యూ ఆల్ అనే కోట్ తో మాత్రమే ఈ లెటర్ లో రాసిందట. పోలీసులకు ఈ లెటర్ చిక్కినా.. పూర్తి వివరాలు తెలియజేడం లేదని టాక్.

అయితే మీరా అంత్యక్రియలకు సినీ పరిశ్రమ తరలివచ్చింది. అందరి గుండెబరువు మధ్యన కిల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌, నటుడు కార్తీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌, ప్రభుదేవా సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మీరాకు నివాళులర్పించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper