Homeఎంటర్టైన్మెంట్అరె.. మరో బోల్డ్ రోల్ లో విద్యాబాలన్ !

అరె.. మరో బోల్డ్ రోల్ లో విద్యాబాలన్ !

Vidya Balanసినిమా ఇండస్ట్రీలో ఎక్స్ పోజింగ్ విషయంలో బోర్డర్స్ దాటిన ప్రతి హీరోయిన్ కి సహజంగా గౌరవం ఇవ్వరు. ఎన్నో అవమానాలు అవహేళనల మధ్యే వాళ్ళు లైఫ్ ను లీడ్ చేయాలి. కానీ ఒకరు ఇద్దరు హీరోయిన్స్ మాత్రం అర్ధనగ్న ప్రదర్శనలు చేసినా.. గౌరవ మర్యాదలు అందుకుంటారు, ఈ లిస్ట్ లోనే విద్యాబాలన్ కూడా ఉంటుంది. బోల్డ్ రోల్స్ లో లిమిట్స్ క్రాస్ చేసినా విద్యాబాలన్ కి మంచి నటిగానే గుర్తింపు వచ్చింది.

నటిగా ఏకంగా డర్టీ పిక్చర్ సినిమా చేసిన తర్వాత కూడా, వల్గారిటీ హీరోయిన్ అంటూ ఆమె పై ఆ బోల్డ్ ప్రభావం పడలేదు అంటే, విద్యాబాలన్ కి నటన మీద ఉన్న ఆసక్తే కారణం. ఏది ఏమైనా విద్యాబాలన్ కి డర్టీ పిక్చర్ బాగా ప్లస్ అయింది. డర్టీ పిక్చర్ లో నటించి తన విశ్వరూపం చూపించింది. ఎందరో రసిక హృదయాలను రొమాంటిక్ కలల ప్రపంచంలో విహరింప చేసింది.

అయితే, ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత, ఎక్స్ పోజింగ్ కి దూరం అయిపోయింది. ప్రస్తుతం హౌస్ వైఫ్ పాత్రలకే పరిమితం అయింది. కానీ విద్యాబాలన్ ఇప్పుడు కొత్తగా గ్లామర్ ను ఒలకబోయటానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. భర్త లేని ఓ ఆంటీ ప్రేమలో పడితే, ఆ తర్వాత తానూ ప్రేమించింది, తనకు అల్లుడు అయ్యే వరుస వ్యక్తి అని తెలిస్తే.. ఆ తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది మెయిన్ పాయింట్.

మొత్తానికి పాయింట్ కాస్త బూతు టోన్ లో ఉంది. మరి విద్యా బాలన్ ఆ ఆంటీ పాత్రలో ఏ స్థాయిలో అందాలను ఒలకబోస్తోందో చూడాలి. విద్యా ఆ మధ్య ఓ మ్యాగజిన్ కోసం లేటు వయసులో కూడా అందాలు ఆరబోసింది. ఆ ఫోటో షూట్ తో తనలో ఇప్పటికీ ఎక్కడా గ్లామర్ తగ్గలేదని.. మరోసారి రసిక రాయుళ్ళ పై మన్మధ బాణాలు వేయడానికి తానూ సర్వం సిద్దమే అని ఇన్ డైరెక్ట్ గా చాటి చెప్పింది. ఇప్పుడు ఓ బోల్డ్ పాత్ర పై ఫోకస్ పెట్టింది.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular