
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా హామీ ఇవ్వడమే యువతకు సీఎం జగన్ చేసిన పెద్ద మోసమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ కేసులతో జగన్ కేంద్ర ప్రభుత్వానికి లొంగారని విమర్శించారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాదని చేతులెత్తేసిన జగన్ ప్రజలను దగా చేశారని మండిపడ్డారు. ఏపిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి దిగజారి పోయాయని విమర్శించారు. నిరుద్యోగ రేటు 13.5కి పెరిగిపోయిందని యనమల అన్నారు.