Homeఎంటర్టైన్మెంట్Faria Abdullah : బోనం గురించి గొప్పగా చెప్పినందుకు.. ఫరియా అబ్దుల్లా మీద ఇంత కక్షా.....

Faria Abdullah : బోనం గురించి గొప్పగా చెప్పినందుకు.. ఫరియా అబ్దుల్లా మీద ఇంత కక్షా.. మా చిట్టిని ఏడిపించారు కదరా..

Faria Abdullah : మనిషి పుడుతున్నప్పుడు మతం తెలియదు. తల్లిపాలు తాగుతున్నప్పుడు కులం తెలియదు. తన ఈడు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు తన వర్గం తెలియదు. పాఠశాలకు వెళ్లి పాటలు నేర్చుకుంటున్నప్పుడు వర్ణం తెలియదు. ఇన్నిచోట్ల ఒక మనిషి స్వేచ్ఛగా ఎదుగుతున్నప్పుడు.. లోకం పొగడ తెలియకుండా పెరుగుతున్నప్పుడు.. అలానే ఉండనివ్వాలి కదా. కానీ మన సమాజం ఎలా మారిపోయింది అంటే.. కులాలవారీగా.. మతాలవారీగా.. వర్గాల వారీగా.. వర్ణాలవారీగా విడిపోయింది. నేటి ఆధునిక కాలంలో మనుషులు మారుతున్నారు. కులాలను పక్కన […]

Faria Abdullah : మనిషి పుడుతున్నప్పుడు మతం తెలియదు. తల్లిపాలు తాగుతున్నప్పుడు కులం తెలియదు. తన ఈడు పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు తన వర్గం తెలియదు. పాఠశాలకు వెళ్లి పాటలు నేర్చుకుంటున్నప్పుడు వర్ణం తెలియదు. ఇన్నిచోట్ల ఒక మనిషి స్వేచ్ఛగా ఎదుగుతున్నప్పుడు.. లోకం పొగడ తెలియకుండా పెరుగుతున్నప్పుడు.. అలానే ఉండనివ్వాలి కదా. కానీ మన సమాజం ఎలా మారిపోయింది అంటే.. కులాలవారీగా.. మతాలవారీగా.. వర్గాల వారీగా.. వర్ణాలవారీగా విడిపోయింది.

నేటి ఆధునిక కాలంలో మనుషులు మారుతున్నారు. కులాలను పక్కన పెడుతున్నారు. మతాలను తొక్కిస్తున్నారు. వర్గాలను వద్దనుకుంటున్నారు. వర్ణాలను దూరం పెడుతున్నారు. మనుషులలాగా బతుకుతున్నారు. అయినప్పటికీ కొందరు ఈ పరిణామాన్ని జీర్ణించుకోవడం లేదు. అంతేకాదు మతాన్ని రెచ్చగొడుతున్నారు. కులాన్ని తట్టి లేపుతున్నారు. వర్గాలను.. వర్ణాలను అనుకూలంగా వాడుకునేందుకు ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇటువంటి వారి వల్ల ఇబ్బంది పడుతున్నారు.

జాతి రత్నాలు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఫరియా అబ్దుల్లా. ఇటీవల ఆమె బోనాల వేడుకల సందర్భంగా.. తెలంగాణ గురించి.. తెలంగాణ కల్చర్ గురించి గొప్పగా చెప్పింది. ఆ సమయంలో తాను భావోద్వేగానికి గురైంది. బోనం అంటే తనకు ఎమోషన్ అంటూ తన మనసులో మాట బయట పెట్టుకుంది. ఫరియా అబ్దుల్లా ఒక ముస్లిం. అటువంటిది హిందువుల పండుగ గురించి అంత గొప్పగా చెప్పడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. ఇంకేముంది ఆమె మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో ఫరియా ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీటి పర్యంతమైంది.

“నా తండ్రి ఇస్లాం గురించి గొప్పగా చెప్పేవాడు. నా తల్లి అల్లా గురించి అద్భుతంగా వివరించేది. ఎన్నడూ కూడా మతాలవారీగా విభజన రేఖ వారు చూపలేదు. నాక్కూడా మతాలు అంటే అంతగా ఇష్టం ఉండదు. నా మనసులో ఉన్న మాట చెప్పాను. అలాంటిది నన్ను ఇలా టార్గెట్ చేస్తారని అనుకోలేదని” ఫరియా వ్యాఖ్యానించింది. దీంతో ఆమెకు చాలామంది సంఘీభావం చెబుతున్నారు. కొంతమంది నీచులు అలానే ఉంటారని.. వారిని పట్టించుకోవద్దని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఆమెకు సూచిస్తున్నారు. ఫరియా కన్నీటిపర్యంతమవుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఫరియా ను ఇంతలా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper