Homeఆంధ్రప్రదేశ్‌Joseph Ravan: ఏడు రోజుల కస్టడీ.. రావణ్ వెనుక ఉన్నవారు బయటికి వస్తారా..

Joseph Ravan: ఏడు రోజుల కస్టడీ.. రావణ్ వెనుక ఉన్నవారు బయటికి వస్తారా..

Joseph Ravan: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వ్యవహారంలో ఏపీ పోలీసులకు గన్నవరం కోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఏడు రోజులపాటు కష్ట డీకి తీసుకుంటామని వారు అభ్యర్థించడంతో.. కోర్టు ఒప్పుకుంది. దీంతో అతడిని ఏడు రోజులపాటు ఏపీ పోలీసులు విచారించబోతున్నారు. ఏపీలో ఇప్పుడు ఈ పరిణామం అత్యంత కీలకంగా మారింది. ఈ విచారణలో రావణ్ వెనుక ఎవరు ఉన్నారు.. వారి లక్ష్యం ఏమిటి.. పవన్ కళ్యాణ్ మీద ఆయన ఆ స్థాయిలో ఎందుకు విమర్శలు […]

Joseph Ravan: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వ్యవహారంలో ఏపీ పోలీసులకు గన్నవరం కోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఏడు రోజులపాటు కష్ట డీకి తీసుకుంటామని వారు అభ్యర్థించడంతో.. కోర్టు ఒప్పుకుంది. దీంతో అతడిని ఏడు రోజులపాటు ఏపీ పోలీసులు విచారించబోతున్నారు. ఏపీలో ఇప్పుడు ఈ పరిణామం అత్యంత కీలకంగా మారింది.

ఈ విచారణలో రావణ్ వెనుక ఎవరు ఉన్నారు.. వారి లక్ష్యం ఏమిటి.. పవన్ కళ్యాణ్ మీద ఆయన ఆ స్థాయిలో ఎందుకు విమర్శలు చేశారు.. ఇలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి.. దీనికి ఎవరు ఫండింగ్ చేశారు అనే విషయాలు బయటకు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. రావణ్ యువతను తీవ్రమైన భావజాలం వైపు ఆకర్షితులయ్యే విధంగా రెచ్చగొట్టడం.. ఆ తరహాలో వీడియోల రూపొందించడం.. ఏలూరు ప్రాంతంలో జరిగిన ఒక సభలో మావోయిస్టు సిద్ధాంతాలను సమర్ధించారని.. నక్సలిజం వైపు వెళ్లే విధంగా ప్రసంగాలు చేశారని ఏపీ పోలీసులు రావణ్ మీద అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికే ఏపీ పోలీసులు ఆయన మీద ఉపా.. ఇంకా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. రాజ్యాంగ వ్యవస్థలను కూల్చివేసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాలని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు.

రావణ్ వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు.. వారి ఉద్దేశ్యాలు ఏమిటి.. తెలుసుకోవడానికి విచారణ తప్పనిసరి అని ఏపీ పోలీసుల తరఫున న్యాయవాది గన్నవరం కోర్టులో వాదించారు. కొందరు మాజీ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులతో రావణ్ కు సంబంధాలు ఉన్నాయని.. వారి ద్వారా అతనికి నిధులు అందుతున్నాయని ఏపీ పోలీసులు చెబుతున్నారు. రావణ్ చేసిన ప్రసంగాల వెనుక ఉన్న అసలు విషయాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం న్యాయమూర్తి పోలీసుల వాదనతో ఏకీభవించింది. వారం పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ఈరోజు నుంచి మొదలయ్యే విచారణ అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. కస్టడీ సమయంలో రావణ్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు.. సోషల్ మీడియా ఖాతాలు.. వాటి నిర్వహణ.. దానికోసం సపోర్ట్ చేసిన వ్యక్తుల వివరాలను పోలీసులు బయటపెట్టనున్నారు. ఈ ఎంక్వయిరీలో ఎటువంటి కుట్ర కోణాలు బయటకు వస్తాయి?, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు కీలకంగా మారింది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper