Homeఆధ్యాత్మికంToday 9 August 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు వద్దన్నా డబ్బు..

Today 9 August 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు వద్దన్నా డబ్బు..

Today 9 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అధిక లాభాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం […]

Today 9 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అధిక లాభాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో పెద్దలను సంప్రదించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులకు గురువుల ఆశీస్సులు ఉంటాయి. దీంతో చదువులో రాణిస్తారు. అనవసరంగా ఎవరికి అప్పులు ఇవ్వద్దు. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు కంపెనీలనుంచి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలకమైన పెట్టుబడును పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి కత్తులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త వస్తువులు కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కొత్త వ్యక్తులు పరిచయమయ్య అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో వారితో అప్పుడే రహస్యాలను పంచుకోవద్దు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువే. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అద్భుతమైన లాభాలు ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వారితో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రత్యేకంగా చర్చలో పాల్గొంటారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలను సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులకు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల ను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పెట్టుబడుల విషయంలో పెద్దలను సంప్రదించాలి. జీవిత భాగస్వామి సలహాతో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితి ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తోంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశాలు అందుతాయి. సరైన ప్రోత్సాహం ఉండడంతో కొందరు తమ కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు ఓపికతో వ్యవహరించాలి. కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరపు వాగ్దానాలు ఇవ్వకూడదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper