Homeఎంటర్టైన్మెంట్Ram Charan : రామ్ చరణ్ , సుకుమార్ చిత్రంలో హీరోయిన్ గా ఒకప్పటి చైల్డ్...

Ram Charan : రామ్ చరణ్ , సుకుమార్ చిత్రంలో హీరోయిన్ గా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్..

Ram Charan: ‘పెద్ది’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నెలాఖరులో కానీ , వచ్చే నెల మొదటి వారం లో కానీ […]

Ram Charan: ‘పెద్ది’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నెలాఖరులో కానీ , వచ్చే నెల మొదటి వారం లో కానీ , ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ రానుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే అంశం పై ఇప్పటికే సోషల్ మీడియా లో చాలా గాసిప్స్ వినిపించాయి. కొందరు అలియా భట్ పేరు చెప్పగా, మరికొందరు రుక్మిణి వాసంత్ పేరు చెప్పారు.

కొంతమంది అయితే రష్మిక పేరు ని కూడా ప్రస్తావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ , డైరెక్టర్ సుకుమార్ హీరోయిన్ విషయం లో తీసుకున్న ఒక సంచలన నిర్ణయం, ఇప్పుడు అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. ఒకప్పుడు బాలనటిగా ఎన్నో సూపర్ హిట్స్ లో నటించి , రీసెంట్ గానే ధురంధర్ చిత్రం తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సరా అర్జున్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట. అనేక మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ , ఈమె మాత్రమే ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ ఈమెని ఎంచుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కానీ సరా అర్జున్ చూసేందుకు చాలా చిన్న అమ్మాయి లాగా కనిపిస్తోంది. రామ్ చరణ్ కి సూట్ అవుతుందా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

కానీ నటన పరంగా కానీ , పాత్ర తీరు తెన్నలకు సరిపోయేది సరా అర్జున్ మాత్రమేనని సుకుమార్ ఫిక్స్ అయిపోయాడట. త్వరలోనే హీరోయిన్ కి సంబంధించిన అధికారిక అప్డేట్ రానుంది. అదే విధంగా ఈ చిత్రం లో విలన్ పాత్ర కోసం ఒక స్టార్ హీరో ని సంప్రదించారట డైరెక్టర్ సుకుమార్. ఆ హీరో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్కోప్ లోనే తెరకెక్కించాలని చూస్తున్నాడు సుకుమార్. రంగస్థలం వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో , ట్రేడ్ లో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper