Raj Tarun: రాజ్ తరుణ్ పై మాజీ ప్రేయసి లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లావణ్యతో రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నాడట. లావణ్యను గుడిలో రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడట. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలని అనుకుంటున్నాడనేది లావణ్య ఆరోపణ.
లావణ్య ఆరోపణలు రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. గతంలో లావణ్యతో తనకు రిలేషన్ ఉన్న మాట వాస్తవమే అన్నాడు. అయితే తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. గుడిలో పెళ్లి చేసుకున్నాను అనేది పచ్చి అబద్ధం. డ్రగ్స్ తీసుకుని నాకు టార్చర్ చూపించింది. బ్లాక్ మెయిల్ చేసేది. ఆమెకు మరొక అబ్బాయితో రిలేషన్ ఉంది. ఈ కేసును లీగల్ గా ఎదుర్కొంటానని రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైతం లావణ్య ఆరోపణలు ఖండించింది.
రాజ్ తరుణ్ నాకు సహ నటుడు మాత్రమే. మా మధ్య లావణ్య ఆరోపిస్తున్నట్లు ఎఫైర్ లేదని అన్నారు. అయితే ఇదంతా పూర్తిగా పబ్లిసిటీ స్టంట్ అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ ఉద్దేశపూర్వకంగా ఈ రాద్ధాంతం చేస్తున్నాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లో బడ్జెట్ చిత్రాలు, సిరీస్ల ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియోలు చేయడం లేటెస్ట్ ట్రెండ్. విశ్వక్ సేన్, అల్లరి నరేష్, బిగ్ బాస్ సన్నీ… తమ చిత్రాలు, సిరీస్ల ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియోలు చేశారు.
ఇటీవల నివేద పేతురాజ్ చేసిన ఫ్రాంక్ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక దశలో అది నిజమే అని అందరూ నమ్మారు. పరువు వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం నివేద పేతురాజ్ పోలీసులు తన కారు ఆపి సోదా చేయాలన్నట్లు ఫ్రాంక్ వీడియో చేసింది. అనంతరం అసలు విషయం తెలిసింది. అయితే చాలా ఫ్రాంక్ వీడియోలను పబ్లిసిటీ స్టంట్ అని జనాలు పసిగట్టేస్తున్నారు. రాజ్ తరుణ్ తన కొత్త మూవీ తిరగబడరసామీ ప్రమోషనల్ భాగంగా ఈ వివాదం తెరపైకి తెచ్చారని అంటున్నారు. విజయాలు లేక ఇబ్బందిపడుతున్న రాజ్ తరుణ్ లావణ్యతో కావాలనే కేసు పెట్టించాడు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు..
Web Title: A new angle in the raj tarun lavanya controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com