Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Mrunal Thakur: ఆ విషయాలకు దూరంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు తగ్గాయంటున్న మృణాల్ ఠాకూర్...

Mrunal Thakur: ఆ విషయాలకు దూరంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు తగ్గాయంటున్న మృణాల్ ఠాకూర్…

సీతారామం సినిమా సక్సెస్ అవ్వడంతో ఆమెకు భారీ ఆఫర్లు అయితే వచ్చాయి. కానీ వాటిలో ఆమె సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

Mrunal Thakur: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి హీరోయిన్లు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే అవకాశం అనేది ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి సినిమాల సెలెక్షన్ లో హీరోయిన్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చింది అంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాలి. ఇక ఇది ఇలా ఉంటే హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ‘మృణాల్ ఠాకూర్’ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

అయితే సీతారామం సినిమా సక్సెస్ అవ్వడంతో ఆమెకు భారీ ఆఫర్లు అయితే వచ్చాయి. కానీ వాటిలో ఆమె సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం చాలా ఆక్టివ్ గా ఉంటూ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక రీసెంట్ వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ సాధించలేదు. అయినా కూడా ఆమె ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో బిజీ అయింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ఇప్పటికే చాలా సినిమాల్లో అవకాశాలను కోల్పోయానని చెప్పింది.

ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి ముద్దు సీన్లు,రొమాంటిక్ సీన్లు నచ్చవనే ఉద్దేశ్యంతో తను అలాంటి సీన్లు ఉన్న సినిమాలు చేయకూడదని నియమం పెట్టుకుందట. ఎందుకంటే తను అలాంటి సీన్లలో నటిస్తే వాళ్ళ పేరెంట్స్ తనని ఎలా చూస్తారని భయపడేదట. కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్నప్పుడు ఇవన్నీ వృత్తిలో భాగమే అని తర్వాత తెలుసుకుందట. ఇక దాంతో వాళ్ల పేరెంట్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పిందట. తను ఉన్న వృత్తిలో సినిమాలోని సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్ అయిన చేయక తప్పదని చెప్పిందట…

ఇక దాంతో వాళ్ల పేరెంట్స్ కూడా కొద్ది వరకు కన్విన్స్ అయ్యారట… ఇక మొత్తానికైతే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి… ఇక తను లిమిటేషన్స్ ఏమీ పెట్టుకోకుండా అన్ని రకాల క్యారెక్టర్లు చేయగలిగితే ఆమె తొందర్లోనే స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper