NVIDIA DLSS 5 : టెక్నాలజీ మారిపోతుంది. మనుషుల అవసరాలు మరింత పెరుగుతున్నాయి. కచ్చితత్వాన్ని మనుషులు ఎక్కువ కోరుకుంటున్నారు. అలాంటప్పుడు టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. ఫ్యూచర్ కాలాన్ని ముందుగానే ఊహించి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
టెక్నాలజీ అనే పదం తెరపైకి వస్తే ఖచ్చితంగా అందులో ఎన్ వీడియా పేరు కచ్చితంగా ఉంటుంది. చిప్.. గ్రాఫిక్ కార్డుల తయారీలో ఈ కంపెనీకి తిరుగులేదు. పైగా ఇటీవల ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థ తాజాగా deep learning super sampling 5 పేరుతో సరికొత్త సాంకేతికతను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సెప్టెంబర్ 3న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. NBA 2K 27 గేమ్ తో ఈ టెక్నాలజీ ప్రపంచ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
DLSS 5 వెర్షన్ ముఖ్యమైన విశేషాలు ఇవి
3D guided neural rendering
ఇది పాత డీఎల్ఎస్ఎస్ వెర్షన్ల మాదిరిగా కేవలం ఇమేజ్ రిజర్వేషన్ పెంచడం లేదా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడంతోనే ఆగిపోదు. గేమ్ ఇంజన్ 3d డేటాను ఉపయోగించి మరింత వాస్తవికత కాంతిని.. మెటీరియల్ ఫీచర్లను ఏఐ టెక్నాలజీ ద్వారా అందిస్తూ ఉంటుంది.
Supporting graphics cards
ప్రస్తుతం ఇది సరికొత్త GeForce RTX 50 series GPU , laptop వంటి వాటిల్లో అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఎక్స్ 40 సిరీస్ కి కూడా ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత.. త్వరలోనే పాత జి ఫోర్స్ ఆర్టిఎక్స్ 40 సిరీస్ కార్డ్స్ కు కూడా డి ఎల్ ఎస్ ఎస్ 5 కి అఫీషియల్ సపోర్ట్ అందిస్తామని ఎన్ వీడియా కంపెనీ ప్రకటించింది.
క్లౌడ్ గేమింగ్
ఈ టెక్నాలజీ ఎన్విడియా క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫారం అయిన జీ ఫోర్స్ నౌ లో కూడా అందుబాటులో ఉంది.. గేమ్స్ మరింత నిజమైన ప్రపంచాన్ని తలపించే విధంగా ఈ జనరేటివ్ న్యూరల్ ఫ్రెండ్ రింగు టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ టెక్నాలజీలో ప్రధానంగా గేమ్లలో అత్యంత వాస్తవికమైన లైటింగ్.. షాడోస్.. మెటీరియల్ వివరాలను రియల్ టైంలో మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. గత వెర్షన్లు కేవలం గేమ్ రిజర్వేషన్ పెంచడం లేదా అదనపు ఫ్రేమ్లను జోడించడం పైనే దృష్టిపెట్టాయి. డి ఎల్ ఎస్ ఎస్ 5 గేమ్ గ్రాఫిక్స్ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే విధంగా ఎన్వీడియా ఈ టెక్నాలజీని రూపొందించింది..
సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా ప్రతి కాంతి కిరణాన్ని విడివిడిగా లెక్కించకుండా.. కృత్రిమ మేధ సహాయంతో కాంతి లోని వివిధ ఉపరితలపై ఎలా స్పందిస్తుందో ముందుగానే గురించి గ్రాఫిక్స్ డిజైన్ చేస్తుంది. దీనివల్ల గేమింగ్ విజువల్స్ హాలీవుడ్ స్థాయి సినిమాల మాదిరిగా కనిపిస్తుంటాయి.
గేమ్స్ ఆడుతున్నప్పుడు మనుషుల చర్మంపై కాంతి పరావర్తనం చెందుతుంది. జుట్టు లేదా దుస్తులపై వెలుతురు పడే విధానం.. మెటల్ లేదా నీటిపై వచ్చే ప్రతిబింబాలను ఇది అత్యంత సహజంగా చూపిస్తూ ఉంటుంది.
గేమ్ డెవలపర్లు డిజైన్ చేసిన అసలు రూపాన్ని మార్చకుండా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కేవలం అందులో ఉన్న రంగులను లైటింగ్ను మాత్రమే మరింత అందంగా మార్చుతుంది. ఒకవేళ డెవలపర్లు ఏఐ ప్రభావాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో ముందుగానే నియంత్రించుకోవచ్చు.
ఇది అధికారికంగా సరికొత్త జి ఫోర్స్ ఆర్టిఎక్స్ 50 సిరీస్ జిపియు.. లాప్టాప్ ల కోసం అందుబాటులోకి వచ్చింది. అయితే పాత ఆర్టిఎక్స్ 40 సిరీస్ కార్డులకు కూడా ఎన్వీడియా సపోర్టు ఇవ్వనుంది.