Homeఎంటర్టైన్మెంట్OTT Movies: ఈ వారం OTT ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్..'బిగ్ బాస్' ని మించిన...

OTT Movies: ఈ వారం OTT ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్..’బిగ్ బాస్’ ని మించిన రియాలిటీ షో!

OTT Movies: ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీ లో మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చే సినిమాలు , వెబ్ సిరీస్ లు , రియాలిటీ షోలు రాబోతున్నాయి. టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రావడం లేదు కానీ , హాలీవుడ్ నుండి మాత్రం ఆసక్తికరమైన సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్ 10’ హవానే కనిపిస్తోంది. […]

OTT Movies: ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీ లో మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చే సినిమాలు , వెబ్ సిరీస్ లు , రియాలిటీ షోలు రాబోతున్నాయి. టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రావడం లేదు కానీ , హాలీవుడ్ నుండి మాత్రం ఆసక్తికరమైన సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్ 10’ హవానే కనిపిస్తోంది. కానీ రేపటి నుండి మాత్రం రియాలిటీ షోస్ ని ఇష్టపడే వాళ్ళు డివైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లో రేపటి నుండి ‘ది ట్రైటర్స్ ‘ షో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో , ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా అలరించేందుకు సిద్ధమైంది.

తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. బిగ్ బాస్ కాన్సెప్ట్ కంటే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ షో సాగనుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ షో మరికొద్ది గంటల్లోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. కంటెస్టెంట్స్ ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది కూడా రివీల్ చేశారు. హర్ష వర్ధన్ , ఆశికా పదుకొనే, వర్ష, నిఖిల్ విజయేంద్ర సింహా , ప్రగతి, విష్ణు OI, మౌనీషా చౌదరి (స్నో అక్క) తదితరులు ఈ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నారు. ప్రతీ గురువారం రోజున సరికొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ షో మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో లో లాగిన్ అయ్యి ఈ అర్థ రాత్రి నుండి ఈ రియాలిటీ షో ని చూసేందుకు సిద్ధం అవ్వండి.

అదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో యానిమల్ అనే హాలీవుడ్ చిత్రం తో పాటు , ఈటీవీ విన్ యాప్ లో కాగితం పడవలు అనే చిత్రం కూడా విడుదల కాబోతుంది. గత వారం విడుదలైన ఓటీటీ సినిమాలు , వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ బాబు దర్శకత్వం లో తెరకెక్కిన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే వెబ్ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది , ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper