Teja Sajja: బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, ఇప్పుడు హీరో గా కూడా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జ సినిమా వస్తుందంటే , కచ్చితంగా ఆ సినిమాలో ఎదో విషయం ఉండే ఉంటుంది , థియేటర్స్ కి వెళ్లి ఒక్కసారైనా చూడాలి అనే రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని సొంత చేసుకున్నాడు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి వరుస సూపర్ హిట్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న తేజ సజ్జ, ప్రస్తుతం ‘జాంబీ రెడ్డి 2’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన ఇండియా లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటిగా నిల్చిన ‘ది ట్రైటర్స్’ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ గురువారం రోజున కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెలలో హైదరాబాద్ లోని తన నివాసం లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంటాడని , డిసెంబర్ నెలలో ఉదయపూర్ ప్యాలస్ లో కుటుంబ సభ్యులు , మిత్రులు , సన్నిహితుల సమక్షం లో పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. పెళ్లి కూతురు సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయి కాదట , సాఫ్ట్ వేర్ ఉద్యోగి అట. త్వరలోనే ఈ పెళ్ళికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. చిన్న పిల్లాడిగా మన కళ్ల ముందు వెండితెర పై కనిపించిన తేజ సజ్జ , చూస్తూ ఉండగానే హీరో గా ఎంట్రీ ఇవ్వడం , సక్సెస్ లు అందుకోవడమే కాకుండా, ఒక ఇంటివాడు కూడా అవ్వబోతున్నందుకు ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
ఈమధ్య కాలం లో పెళ్లి చేసుకున్న ప్రతీ యంగ్ హీరో , కెరీర్ లో ఎప్పుడూ చూడనంత సక్సెస్ ని చూసి తమ అభిమానులకు మంచి అనుభూతిని కలిగించారు. ఇక తేజ సజ్జ కి పెళ్ళికి ముందే మంచి హిట్స్ ఉన్నాయి , ఇక పెళ్లి తర్వాత ఆయన ఎలాంటి హిట్స్ ని అందుకోబోతాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘జాంబీ రెడ్డి 2’ విషయానికి వస్తే , ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. శాన్య కపూర్ హీరోయిన్ గా