Elections Notification: కాసేపటి క్రితమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుండి నామినేషన్స్ ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబర్ 28 న పోలింగ్ , అక్టోబర్ 30 న ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడత లో కేవలం 13 మున్సిపల్ కార్పొరేషన్స్ లోనే ఎన్నికలు నిర్వహించబోతున్నారు అట. శ్రీకాకుళం , రాజమండ్రి , కాకినాడ , మంగళగిరి కార్పొరేషన్స్ కి సంబంధించిన ఎన్నికలు మూడవ విడత లో నిర్వహిస్తారట. నవంబర్ 5 న మూడవ విడత కి సంబంధించిన ఫలితాలు వెలువడుతాయట. అత్యంత పారదర్శకంగా ఈ ఎన్నికలను నిర్వహించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇదంతా పక్కన పెడితే , నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పటికీ జరగలేదట. నేడు సీఎం చంద్రబాబు నాయుడు తో జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ , హరి ప్రసాద్ భేటీ అయ్యారు.
సుమారుగా మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది. జనసేన పార్టీ 6 మేయర్ స్థానాలను అడగ్గా , టీడీపీ అందుకు ససేమీరా ఒప్పుకోలేదట. మొదట్లో 3 మేయర్ స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పారు , ఇప్పుడు 4 మేయర్ స్థానాలు ఇస్తామని చెప్పారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో చర్చించబోతున్నారు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ 5 స్థానాలకు తగ్గే అవకాశం లేకపోవడం తో, చివరికి 5 మేయర్ స్థానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా 25 మున్సిపాలిటీ స్థానాలను జనసేన ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందని , కానీ పవన్ కళ్యాణ్ 33 స్థానాలను డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. దీనిపై నేడు , లేదా రేపు ఉదయం లోపు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 18 వ తేదీ నుండి నామినేషన్స్ మొదలు అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ రేపు సీట్ల పంచాయితీ తేలాల్సిందే అని చంద్రబాబు అన్నారట.
తాము అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన పట్టుబట్టి కూర్చుంది. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఫ్రెండ్లీ పోటీ కి ఒప్పుకోవడం లేదట. ఎట్టిపరిస్థితిలోనూ కలిసే పోటీ చెయ్యాలని , ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని అంటున్నాడట. మరి సీట్ల పంచాయితీ లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో మొండిపట్టు పడుతాడని కూటమి నేతలు ఎవ్వరూ కూడా ఊహించలేదని అంటున్నారు విశ్లేషకులు.