Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: తప్పిపోయిన కంటెస్టెంట్స్ ని జాగ్రత్తగా దాచిన యాజమాన్యం.. బిగ్ బాస్...

Bigg Boss 8 Telugu: తప్పిపోయిన కంటెస్టెంట్స్ ని జాగ్రత్తగా దాచిన యాజమాన్యం.. బిగ్ బాస్ 8 ప్లానింగ్స్ ఊహలకు అందట్లేదుగా!

మొదటి ఎపిసోడ్ తోనే లాంచ్ అవ్వబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి గమనిస్తే నిఖిల్, యష్మీ గౌడా, సౌమ్య రావు, బెజవాడ బేబక్క, ఆదిత్య ఓం, విష్ణు ప్రియా, శేఖర్ భాషా, న్యూస్ రీడర్ కళ్యాణి, బేబీ ఫేమ్ గీత, సింగర్ సాకేత్, హీరోయిన్ విస్మయశ్రీ, డ్యాన్సర్ నైనికా, ఖయ్యుమ్ అలీ తదితరులు సెప్టెంబర్ 1వ తేదీనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట.

Bigg Boss 8 Telugu: అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మరో 5 రోజుల్లో స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కానుంది. సీజన్ 7 భారీ హిట్ అవ్వడంతో, 8 వ సీజన్ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతుంది. ఈ సీజన్ లో ఎన్నో ట్విస్టులు ఉంటాయని అక్కినేని నాగార్జున ప్రోమోలో చెప్పడం మీరందరు చూసే ఉంటారు. అయితే సీజన్ ప్రారంభం కాకముందే ఊహించని ట్విస్టులు ఆడియన్స్ కి అనుభవం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ లో మనకి మొదటి నుండి వినిపిస్తున్న పేర్లు తేజస్విని గౌడ, రీతూ చౌదరి, ఇంద్రనీల్, అంజలి పవన్, బంచిక్ బబ్లూ. వీళ్ళతో బిగ్ బాస్ టీం అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా చెయ్యిచారని వార్తలు వినిపించాయి. అయితే ఈ లిస్ట్ నుండి తేజస్విని గౌడ, రీతూ చౌదరీ, ఇంద్రనీల్ తప్పిపోయారు.

వీరిలో తేజస్విని గౌడ అసలు షోలో పాల్గొనే ఆసక్తి లేదు అని బిగ్ బాస్ టీం కి చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఆమెని సెప్టెంబర్ 1న లాంచ్ ఎపిసోడ్ లో కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రెండవ వారంలో, లేదా మూడవ వారంలో తీసుకొస్తారని అంటున్నారు. ఇంద్రనీల్, రీతూ చౌదరీ, అంజలి పవన్, బంచిక్ బబ్లూ విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. 5 వారాల వరకు ప్రతీ వారం ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని, ఆ ఎంట్రీ ద్వారా పైన చెప్పిన కంటెస్టెంట్స్ అడుగుపెడుతారని తెలుస్తుంది. అయితే వారిలో ఒకరిద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేందుకు ఒప్పుకోలేదట. మొదటి ఎపిసోడ్ నుండే పారితోషికం ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదట. వస్తే మొదటి ఎపిసోడ్ లోనే వస్తామని, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వస్తే ఆడియన్స్ తో మాకు కనెక్షన్ తక్కువ అవుతుందని చెప్పారట. అయితే ఆ తప్పుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ కి బదులుగా పాత సీజన్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక మొదటి ఎపిసోడ్ తోనే లాంచ్ అవ్వబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి గమనిస్తే నిఖిల్, యష్మీ గౌడా, సౌమ్య రావు, బెజవాడ బేబక్క, ఆదిత్య ఓం, విష్ణు ప్రియా, శేఖర్ భాషా, న్యూస్ రీడర్ కళ్యాణి, బేబీ ఫేమ్ గీత, సింగర్ సాకేత్, హీరోయిన్ విస్మయశ్రీ, డ్యాన్సర్ నైనికా, ఖయ్యుమ్ అలీ తదితరులు సెప్టెంబర్ 1వ తేదీనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. అంతే కాదు వైల్డ్ కార్డు ఎంట్రీ లిస్ట్ లో ప్రేరణా కంభం (కృష్ణ ముకుంద మురారి ఫేమ్) కూడా ఉందని తెలుస్తుంది. రేపు, లేదా ఎల్లుండి ఈ కంటెస్టెంట్స్ అందరికీ సంబంధించిన డ్యాన్స్ షూటింగ్స్ జరపనున్నారట మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper