Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Slap Controversy: షూటింగ్ సెట్స్ లో రవితేజ చెంప పగులగొట్టిన ప్రముఖ నటుడు..అసలు...

Ravi Teja Slap Controversy: షూటింగ్ సెట్స్ లో రవితేజ చెంప పగులగొట్టిన ప్రముఖ నటుడు..అసలు ఏమైందంటే!

Ravi Teja Slap Controversy: కొంతమంది నటీనటుల ముఖాలు బాగా గుర్తుంటాయి కానీ, వాళ్ళ పేర్లు మాత్రం మనకు తెలియవు. ఎన్నో వందల సినిమాల్లో వాళ్ళను చూసుంటాము కానీ, వాళ్ళ పేరు అడిగితే మాత్రం చెప్పలేని పరిస్థితి. అలాంటి నటులలో ఒకరు CVL నరసింహా రావు. ఈయన మన టాలీవుడ్ లో ఎక్కువగా తండ్రి పాత్రల ద్వారా కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ’ చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి. […]

Ravi Teja Slap Controversy: కొంతమంది నటీనటుల ముఖాలు బాగా గుర్తుంటాయి కానీ, వాళ్ళ పేర్లు మాత్రం మనకు తెలియవు. ఎన్నో వందల సినిమాల్లో వాళ్ళను చూసుంటాము కానీ, వాళ్ళ పేరు అడిగితే మాత్రం చెప్పలేని పరిస్థితి. అలాంటి నటులలో ఒకరు CVL నరసింహా రావు. ఈయన మన టాలీవుడ్ లో ఎక్కువగా తండ్రి పాత్రల ద్వారా కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ’ చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ చిత్రం లో ఈయన హీరోయిన్ స్నేహాకి తండ్రి పాత్రలో కనిపిస్తాడు. సినిమాకు హైలైట్ గా నిల్చిన ట్రైన్ ఎపిసోడ్, అలాగే కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఇతను కనిపిస్తాడు. అయితే రీసెంట్ గా ఈయన ఈ చిత్రం తాలూకా అనుభవాలను పంచుకుంటూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తించుకోదగ్గ చిత్రం వెంకీ..రవితేజ(Mass Maharaja Raviteja) , శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో నాకు మంచి గుర్తింపు ని తీస్కొని రావడమే కాకుండా, భారీ సినిమాల్లో అవకాశాలు దక్కేలా చేసింది. ఈ చిత్రం లో హీరోయిన్ స్నేహా కి తండ్రి పాత్రలో కనిపించాను. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, విడుదలైన కొత్తల్లో నాకు, స్నేహా కి మధ్య విబేధాలు వచ్చాయి అంటూ వార్తలొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నాకు, స్నేహ కి మధ్య షూటింగ్ సమయం లో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె చాలా పద్దతి గల అమ్మాయి. పెద్దలకు చాలా గౌరవం ఇస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి తో నేను ఎందుకు గొడవలు పడుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో నేను ఒక సన్నివేశం లో రవితేజ గారి చెంప పగలగొట్టాలి. నాటక రంగం నుండి వచ్చిన వాడిని కదా, ఆ స్టైల్ లోనే నేను నిజంగానే రవితేజ చెంప మీద గట్టిగా కొట్టాను. సినిమా పద్ధతులు, అప్పటి లైటింగ్స్, కెమెరా యాంగిల్స్ మరియు ఇతర టెక్నీక్స్ గురించి తెలియవు కాబట్టి అలా జరిగిపోయింది. కానీ ఆ తర్వాత తెలిసింది అలా చెయ్యకూడదు అని. రవితేజ గారి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాను, ఆయన మనసులో ఏమి పెట్టుకోలేదు, చాలా మర్యాదతో మాట్లాడేవాడు , చాలా మంచివాడు, పెద్దలంటే గౌరవం. షూటింగ్ స్పాట్ లో రవితేజ ఉన్నంత సేపు చాలా సరదాగా ఉంటుంది. మా అందరినీ ఆయన ఎంతో ప్రేమతో పలకరించేవారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper