spot_img
Homeఎంటర్టైన్మెంట్చైతు.. ఆమెను ఆదుకున్నాడు !

చైతు.. ఆమెను ఆదుకున్నాడు !

సక్సెస్ వచ్చినా ఛాన్స్ లు రాకపోతే ఏమి చేయాలి. కెరీర్ లో ఎంత ఎదుగుదామని ప్రయత్నాలు చేస్తోన్నా ఎలాంటి ప్రయోజనం లేకపోతే ఎవ్వరూ మాత్రం ఏమి చేయగలరు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. అయినా ఒకే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. సరే అని వేరే ఇండస్ట్రీలో కూడా ట్రై చేసింది. అక్కడా దురదృష్టవశాత్తు ఆమెకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక చేసేదేమీ లేక, రెండేళ్ల నుండి ఖాళీగా ఇంట్లో కూర్చుంది. ఇలాంటి టైంలోనే ఆమెకు రవితేజ లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. తన కొత్త సినిమాలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు, ఐతే ఈ అవకాశం వెనుక చైతు రికమండేషన్ ఉందట.

సహజంగా నాగచైతన్య తన సినిమాల కోసమే ఎవర్నీ రికమండ్ చెయ్యడు, కానీ ఆమె కోసం చైతుకి తప్పలేదు అట. అసలు హీరోయిన్లకు దూరంగా ఉండే చైతు.. ఆమెను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు ? ఇంతకీ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ దివ్యాంశ కౌశికే. నిజంగా ఈ బ్యూటీ టాలెంట్ పరంగా, గ్లామర్ పరంగా ఏ మాత్రం వంకపెట్టలేని హీరోయిన్. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయినా ఆ తరువాత ఈ బాలీవుడ్ బ్యూటీకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మజిలీలో నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకున్నా.. మూడేళ్లు ఖాళీగా కూర్చింది. మధ్యమధ్యలో మజిలీ టీమ్ తో టచ్ లో ఉంటూ.. ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసింది.

కానీ ఎందుకో దివ్యాంశ కౌశిక్ ను ఏ డైరెక్టర్ పట్టించుకోలేదు. మజిలీలో ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్ గా నటించినా ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోవడం, సమంత హవాలో దివ్యాంశ కేవలం సెకెండ్ హీరోయిన్ గానే మిగిలిపోవడం.. ఇలా ఆమె కెరీర్ కి అది పెద్ద మైనస్ అయింది. ఇది అర్ధం చేసుకున్న చైతు ఆమెను రవితేజ సినిమాకి సిఫార్సు చేశాడట. దాంతో మూడేళ్ళ నిరీక్షణ తరువాత దివ్యాంశకు సినిమా వచ్చింది. ఏది ఏమైనా చైతు.. ఆమెను ఆదుకున్నాడు. మరి ఇప్పటికైనా ఆమెకు రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ వస్తోందేమో చూడాలి. దివ్యాంశ కౌశిక్ కి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper