Ravi Teja disasters: ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టు అప్డేట్ కాకుంటే అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది కొత్త హీరోలు నేటి తరం యూత్ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు చేస్తూ అలవోకగా వంద కోట్ల గ్రాస్ ని అందుకుంటున్నారు. ఇక ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉంటున్న హీరోలు అప్డేట్ అవ్వగకపోతే ఎలా?, రవితేజ విషయం లో అదే జరుగుతోంది. అతి తక్కువ స్థాయి నుండి హీరో గా మారి, సూపర్ స్టార్ రేంజ్ కి రవితేజ(Mass Maharaja Raviteja) ఎదగడానికి ముఖ్య కారణం మాస్ కమర్షియల్ సినిమాలే. అవి అప్పటి ఆడియన్స్ కి కొత్తగా అనిపించాయి కాబట్టి రవితేజ ని సూపర్ స్టార్ ని చేశారు. కానీ ఇప్పటి ఆడియన్స్ కి అది రొటీన్ అయిపోయింది.
అందుకే ధమాకా తర్వాత రవితేజ 7 సినిమాలు చేస్తే, 7 కూడా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. కొత్త తరహా సినిమాలు తన నుండి ఆడియన్స్ కోరుకుంటున్నారని రవితేజ ఎప్పుడో గ్రహించాడు. అందులో భాగంగానే ఆయన రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వర రావు వంటి చిత్రాలు చేసాడు. కానీ వీటిని డైరెక్టర్స్ సరిగా హ్యాండిల్ చేయకపోవడం తో డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఒక్క ‘ఈగల్’ మాత్రం యావరేజ్ అనే రేంజ్ లో ఆడింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మాస్ జాతర’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ కి రొటీన్ అనిపించడం తో ఫ్లాప్ చేశారు. దీంతో రవితేజ జ్ఞానోదయం అయ్యింది. ఇక నుండి రూటు మార్చాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు. అందుకే కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వడం ఆపేసాడు.
కొత్త డైరెక్టర్స్ కారణంగానే ధమాకా తర్వాత రవితేజ కి ఇన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. మళ్లీ అలాంటి రిస్క్ చేయకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే కిషోర్ తిరుమల దర్శకత్వం లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గానే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన మ్యాడ్ సిరీస్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో కలిసి ఒక సూపర్ హీరో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక మల్టీస్టార్రర్ చేయనున్నాడు. ఇలా వరుసగా మినిమం గ్యారంటీ సినిమాలతో అభిమానులను సంతృప్తి పరిచేలా రవితేజ మాస్ ప్లానింగ్ చేసుకున్నాడు.